వాట్.. యాంకర్ రష్మీ ఆ స్టార్ కమెడియన్ లవరా.. సుధీర్ మాత్రం కాదు..?!

జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై భారీ పాపులారిటి దక్కించుకుంది ర‌ష్మి గౌత‌మ్‌. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షోతో కుర్రాళ్లకు హాట్‌ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ ప‌లు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మి కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ జబర్దస్త్ కంటే ముందే ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఈ ముదురు ముద్దుగుమ్మ వయసు ఎంత.. ఆమె పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ అందులోనూ అమ్మాయిలు వారి వయస్సు చెప్పడానికి అసలు ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఏజ్ దాచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఏజ్ బార్ అయితే ఆఫర్స్ రావేమో అనే భయంతో సాధ్యమైనంత వరకు వయసు గురించి బయటకు రానివ్వరు.

అయితే దాదాపు వికీపీడియాలో వీరి నిజమైన డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే యాంకర్ రష్మి గౌతమ్ అసలు వయసు 41 సంవత్సరాలు ఉంటుంది. 1982లో విశాఖలో పుట్టిన ఈ హాట్ బ్యూటీ 2002లో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రష్మీ హీరోయిన్ కావాలని ఎంతో శ్రమించింది. టాలీవుడ్ లో పలు సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఇక‌ రష్మీకి ఓ కమెడియన్ లవర్ కూడా ఉన్నారు. కమెడియన్ లవర్ అనగానే అందరికీ ఠ‌క్కున గుర్తుకు వచ్చేది సుడిగాలి సుదీర్. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నెటింట ఏ రేంజ్ లో సక్సెస్ సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఓ స్టేజ్‌పై కనిపించారంటే ఆ ఎపిసోడ్ కచ్చితంగా బ్లాక్ బ‌స్టర్ అయ్యే రేంజ్ లో వీరిద్దరి లవ్ ట్రాక్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే గతంలో రష్మీ టాలీవుడ్ కమెడియన్ సునీల్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.

A Stroke Of Big Bad Luck For Rashmi - Telugu Rajyam

ఉదయ్ కిరణ్ – రీచా హీరో, హీరోయిన్లుగా నటించిన హోలీ సినిమాలో సునీల్ ప్రియురాలుగా రష్మి గౌతమ్ నటించిన. సునీల్.. ర‌ష్మి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీని తర్వాత కరెంట్, బిందాస్ ఇలా కొన్ని సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్‌లో నటించింది రష్మీ. ఓ తమిళ్ మూవీ లో హీరోయిన్ గా మెప్పించింది. 22 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వయసు గురించి ఇంత చర్చ జరగడానికి అసలు కారణం ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడమే. పెళ్లి వయసు దాటి ముదురు బ్యూటీగా మారిపోతున్నా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదే అంటూ నెటింట‌ ఆమెకు ఎన్నో ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్‌ను సీరియస్‌గా లవ్ చేస్తుందని.. అందుకే ఇంకా వివాహం చేసుకోలేదని టాక్‌. ఇక సుడిగాలి సుదీర్‌కి కూడా ఇప్పుటి వరకు వివాహం జరగని సంగతి తెలిసిందే.