ఈ విత్తనాలు తింటే.. మీ ఆరోగ్యానికి డోకానే లేదు..!

పైన కనిపించిన గింజలను గుర్తుపట్టారా? అయినా మనకి పిజ్జా మరియు బర్గర్ వంటివి గుర్తుకొస్తాయి కానీ ఇటువంటి పోషకాహారం పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు మరియు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

విత్తనాలలో అవి పుష్కలంగా దొరుకుతాయి. తద్వారా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషకాలు మరియు ఇతర విటమిన్లు కారణంగా మన బాడీ హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ను పప్పును తినడం ద్వారా కూడా మనం హెల్తీగా ఉండవచ్చు. ఇక సన్ఫ్లవర్ విత్తనాలలో పొటాషియం మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని ద్వారా ముఖ సౌందర్యం పెరుగుతుంది.

అంతేకాకుండా గుమ్మడి విత్తనాలలో కూడా ఓమైగా 6 కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ వ్యాధితో బాధపడే వారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక మనమందరం పుచ్చకాయని తింటాం కానీ వాటిలోని గింజలను అస్సలు తినం. కానీ అసలైన పోషకాలు వాటి గింజలలోనే ఉంటాయి. కనుక ఇకనుంచి పుచ్చకాయలో ఉండే గింజలను కూడా తినండి. అలా పైన చెప్పిన సీడ్స్ ను తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోండి.