అందరిని కంట తడి పెట్టిస్తున్న అల్లు అర్జున్ పోస్ట్..అసలు ఏమైందంటే..?

అల్లు అర్జున్ ..సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు ఇది. పుష్ప2 సినిమాతో మరో ఆస్కార్ ని ఇండియాకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్ . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది . పుష్ప2 ది రూల్ అనే పేరుతో త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు సుకుమార్.

ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేస్తున్నారు . కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఫస్ట్ టైం కుదిరిన మూవీ ఆర్య . ఈ సినిమా నేటికీ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా ఆర్య కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి .

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ .. ఆర్య సినిమాని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు . ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఆర్య సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ..”ఇది కేవలం సినిమా కాదు ..నా లైఫ్ ని తిరగరాసింది ..ఎప్పటికీ మర్చిపోలేను ..హార్ట్ టచింగ్ మూవ్మెంట్ “అంటూ పోస్ట్ చేశారు . దీంతో అల్లు అర్జున్ పోస్ట్ చూసిన జనాలు సైతం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు . అంతేకాదు ప్రతి మనిషి కూడా కష్టపడి పైకి ఎదిగితే సక్సెస్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ కలుగుతుంది అని అల్లు అర్జున్ దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రశంసితున్నారు..!!