గుంటూరు పశ్చిమం: క్యాంపెయిన్‌లోనే తేలిపోయిన టీడీపీ… స‌ర్వేల‌న్నీ ర‌జ‌నీ వైపే..?

గుంటూరు ప‌శ్చిమం ఏపీలోనే హాట్ కేకుల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా నిలిచింది. మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీని జ‌గ‌న్ చిల‌క‌లూరిపేట నుంచి వెస్ట్‌కు మార్చిన‌ప్పుడు నాన్ లోక‌ల్ నెగ్గుతుందా ? అన్న డౌట్‌. పైగా టీడీపీ అదే బీసీ మ‌హిళ‌గా లోక‌ల్ అయిన పిడుగురాళ్ల మాధ‌వికి సీటు ఇచ్చింది. గట్టి పోటీ ఉంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారం గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది క్యాంపెయిన్‌లోనే ర‌జ‌నీ ముందు టీడీపీ క్యాండెట్ మాధ‌వి పూర్తిగా తేలిపోయారు.

ఎన్ని స‌ర్వేలు వ‌చ్చినా… చివ‌ర‌కు టీడీపీ అనుకూల స‌ర్వేల్లోనూ ప‌శ్చిమ‌లో మాత్రం ర‌జ‌నీ గెలుపు అనే చెప్పేస్తున్నాయి. ర‌జ‌నీ చాలా ప‌గ‌డ్బందీగా ప్ర‌చారంలోనే ప్ర‌త్య‌ర్థిపై పై చేయి సాధించారు. ఇందుకు చాలా ఫ్యాక్ట‌ర్స్ కూడా ప‌ని చేస్తున్నాయి. ప‌శ్చిమ‌లో మ‌హిళ‌ల ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉండ‌డం.. ర‌జ‌నీ మ‌హిళ కావ‌డంతో పాటు బీసీ అవ్వ‌డం.. మ‌హిళ‌ల్లోకి రెండు నెలల నుంచే చొచ్చుకు పోవ‌డం చాలా అంటే చాలా ప్ల‌స్ అయ్యింది.

ఇటు జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు, డ్వాక్రా మ‌హిళ‌లు, ఇత‌ర ఆశా వ‌ర్క‌ర్లు.. ఇలా ప్ర‌తి రంగంలో ఉన్న మ‌హిళ‌ల‌తో ఆమె స‌మీక్ష‌లు, స‌భ‌లు, స‌మావేశాలు పెడుతూ తన‌ను గెలిపిస్తే ఏం చేస్తారో ? సూటిగా వాళ్ల‌కు అర్థ‌మ‌య్యేలా చెపుతున్నారు. ఇది ఇక్క‌డ మ‌హిళా ఓట‌ర్ల‌కు బాగా ఎక్కేసింది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని ఆమె డెవ‌ల‌ప్ చేసి నిరుపేద‌ల‌కు కూడా ఉచితంగా హై కాస్ట్ లీ వైద్యం అందేలా ఆమె చేసిన తీరుకు చాలా మంది ఆమెకు ఈ సారి ఓటు వేద్దాం అన్న బ‌ల‌మైన సంక‌ల్పంతో ఉన్నారు.

ఇక అసెంబ్లీలో అయినా.. ప్ర‌జా స‌భ‌ల్లో అయినా.. ఏ స‌మ‌స్య‌పై అయినా ధైర్యంగా మాట్లాడ‌డం ర‌జ‌నీ సొంతం. విచిత్రం ఏంటంటే త‌మ ప్ర‌సంగాల ద్వారా ప్ర‌జ‌ల్లో మంచి ఒపీనియ‌న్ తెచ్చుకునే లీడ‌ర్లు చాలా త‌క్కువ‌. అయితే ర‌జ‌నీ ఐదేళ్ల రాజ‌కీయ అనుభ‌వంలోనే ఈ స్టేట‌స్ తెచ్చుకున్నారు. చాలా స్పీడ్గా నిర్ణ‌యాలు.. ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేసేలా వ్యూహాలు ఇవ‌న్నీ ర‌జ‌నీని ఎన్నిక‌ల‌కు ముందే గెలుపు బాట ప‌ట్టించేశాయ‌నే చెప్పాలి. అటు మాధ‌వి ర‌జ‌నీకి పోటీగా బీసీ మ‌హిళ అనుకున్నా ర‌జ‌నీ డేరింగ్‌, గ‌ట్స్‌, స్పీచ్‌ల ముందే ఆమె ఎన్నిక‌ల‌కు ముందే తేలిపోతున్నారు.