పవన్ కళ్యాణ్ పై నాని షాకింగ్ కామెంట్స్.. నాచురల్ స్టార్ లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీల ప్రచారాలు మరింత జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుచున్న పిఠాపురం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ప్రజలకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు.

Pawan Kalyan sympathises injured Jana Sena workers, to hold a press meet in a while

అయితే ఈసారి టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు మద్దతు నిలవడమే కాకుండా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ సారి జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం, బిజెపితో పొత్తు కుదురుచుకున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఈసారి సక్సెస్ సాధించాలని కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో పోలింక సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో ప్రచారం మరింత జోరుగా సాగుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కోసం ప్రచారాలు చేశారు. సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో జనసేనకు మద్దతుగా నిలిచారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడికి సపోర్ట్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని పవన్ కు తన మద్దతును తెలియజేస్తూ.. ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు అతిపెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధించాలని ఆశిస్తున్నా.. నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నా ఆల్ ద వెరీ బెస్ట్ సర్ అంటూ నాని ట్విట్ చేశాడు. ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.