రూ. 4కోట్లతో వచ్చి రూ. 30 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన బన్నీ మూవీ ఏంటో తెలుసా.. కెరీర్ లోనే సో స్పెషల్..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటితో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూట్‌లో బిజీ బిజీగా గ‌డుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. తొందరగా సినిమాను పూర్తి చేసి ఆగస్టు 15లోగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన బెస్ట్ సినిమాల్లో ఆర్య మూవీ కూడా ఒకటి కావడం విశేషం. ఆయన కెరీర్‌లోనే ఇది ఎంతో స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

Watch Aarya (Telugu) (Telugu) Full Movie Online | Sun NXT

కట్ చేస్తే 125 రోజులు ఆడిన ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. కాగా నేడు ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తి కావడంతో మరోసారి ఈ న్యూస్‌ వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా సుకుమార్ ఈ సినిమాకు మొదట అనుకున్న వ్యక్తి ఎవరో.. ఆ మూవీ విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొదట సుకుమార్ కాకినాడలోని ఓ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేసాడు. ఆ టైంలో ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాల్లో ప్రయత్నించి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశాన్ని అందుకున్నాడు. అదే సమయంలో దిల్ రాజు నిర్మాతగా వి. వి. వినాయక డైరెక్షన్లో వచ్చిన దిల్ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు.

దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ అవకాశం ఇస్తాను అంటూ దిల్ రాజు కథను సిద్ధం చేసుకోమని చెప్పారట. ఈ నేపథ్యంలో స్వయంగా సుకుమార్ ఒక క‌థ‌ను రాసుకొని దిల్ రాజుకు వివరించడం.. దిల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన సుకుమార్ చెప్పిన కథ విన్ని కమర్షియల్ గా హిట్ కాదేమో అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. అయితే కొన్ని చర్చల తరువాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దిల్ రాజు. ఇక దిల్ మూవీ స్పెషల్ షోలకు అల్లు అర్జున్ హాజరై సంద‌డి చేశాడు. అతని చలాకితనం చూసిన సుకుమార్ నా సినిమాలో హీరో క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ బన్నిధి అనుకున్నాడ‌ట‌.

Arya 20 Years : 20 ఏళ్ళ 'ఆర్య' రీ యూనియన్ స్పెషల్ పార్టీ.. బన్నీ, సుకుమార్,  దిల్ రాజుతో సహా మూవీ యూనిట్ అంతా.. | Allu arjun sukumar dil raju arya movie  completed 20 years movie unit

మనసులో మాట దిల్ రాజుకు చెప్తే ఆయన వెంటనే అల్లు అర్జున్‌తో మాట్లాడారు. గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన బన్నీ.. వీళ్ళు చెప్పేది రొటీన్ స్టోరీ నే అనుకొని రిజెక్ట్ చేశారట. ఎట్టకేలకు కథ వినిపించగా.. స్టోరీ విన్న బన్నీ ఇంప్రెస్ అయ్యాడు. అల్లు అరవింద్, చిరంజీవి కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదట ఈ ప్రాజెక్టుకు నాచికితా అనే టైటిల్ పెట్టాలనుకున్న చివరకు ఆర్య టైటిల్ ని ఫిక్స్ చేశారు. నవంబర్ 19, 2004న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో వ‌చ్చి రూ.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు అల్లు అర్జున్ సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు ఉత్తమ దర్శకుడుగా తొలి సినిమాతోనే సుకుమార్ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అలా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే సో స్పెషల్ మూవీ గా నిలిచిపోయింది.