“పెళ్లి వద్దు కానీ ,అది కావాలి”..ఈ హీరోయిన్ మాటలకు ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏం మాట్లాడుతున్నారు ..? ఎలా మాట్లాడుతున్నారో..? అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది . ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటుంది . తమ ఓన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు . అయితే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తాజాగా ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . ఆ హీరోయిన్ ఎవరఓ కాదు ఫరియా అబ్దుల్లా . జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీ గా దూసుకెళ్తుంది.

రీసెంట్ గానే “ఆ ఒక్కటి అడక్కు” అనే సినిమాలో నటించింది . ఆ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది . కాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి పిల్లలు పై సంచలన కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” నాకు మ్యారేజ్ పై అస్సలు నమ్మకం లేదు . ఒకవేళ అయితే అవ్వచ్చు కాకపోతే కాదు.. కానీ పిల్లలను మాత్రం కనాలని ఉంది.. నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం “..

“అమ్మ అవుతాను కానీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించాలి. దేవుడు మనకు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. మనం ఎంత మందిని కావాలంటే అంత మందిని ప్రొడ్యూస్ చేయొచ్చు .. అయితే తండ్రి బాధ్యతలు కూడా ఉండాలి కదా..? ఒక బిడ్డను పెంచడానికి తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది. అదే నాకు పెద్ద డౌట్.. మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే నాకు భయం “అంటూ కన్ఫ్యూషన్ కామెంట్స్ చేసింది ఫరీయా అబ్దుల్లా . సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!