“ఆ పుష్ప సినిమా వేస్ట్..దమిడికి కూడా పనికి రాలేదు “..స్టార్ హీరో సంచలన కామెంట్స్..!!

“పుష్ప ..పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదేలే”.. ఈ డైలాగ్ గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆ ఫీలింగ్ మారదు . చెప్పిన ప్రతిసారి కూడా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి . అలాంటి ఓ స్పెషల్ డైలాగులు రాశాడు సుకుమార్ జనాల కోసం . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేదాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమా ఏకంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉంది . ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకువచ్చిన పుష్ప2 సినిమా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు అంతలా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు బన్నీ – సుకుమార్ .

కేవలం వీళ్లిద్దరే కాదు సినిమాలో నటించే ప్రతి నటీనటుడు టెక్నీషియన్స్ కూడా ప్రాణం పెట్టి పని చేస్తున్నారు . కాగా ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలయాళీ నటుడు ఫహద్ ఫసిల్..పుష్ప సినిమా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు .గుండు లుక్ లో అదిరిపోయే రేంజ్ లో నటించాడు. ఈ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఆయన ఓ కారణమే. ” పార్టీ లేదా పుష్ప..?” అంటూ ఓ రేంజ్ లో చెప్పిన డైలాగ్ ఇప్పటికి ట్రెండ్ అవుతుంది.

“అయితే ఆయన మాత్రం పుష్ప సినిమా నా కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు ..అలాగే నేను కూడా ఎలాంటి లాభాన్ని పొందలేదు ..ఈ విషయాన్ని నేను సుకుమార్ ముందు కూడా చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు”. దీంతో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా చిన్నదిగా ఉంటుంది అని.. ఆ కారణంగానే ఆయనకు గుర్తింపు రాకపోయి ఉండొచ్చు అని ..పుష్ప 2 లో మాత్రం ఆయన క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు . అంతేకాదు కొంతమంది ఆయన మాటలపై గుర్రుగా ఉన్నారు..!