పవన్ జాతకంలో ఆ యోగమే లేదు.. ఫ్యాన్స్ కు మండిస్తున్న వేణు స్వామి కామెంట్స్..?!

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జ్యోతిషాలు చెప్తూ వేణు స్వామి భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆయ‌న‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ.. రెండు సంవత్సరాలు ముందు నుండే జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కెసిఆర్ సెంట్రల్ పాలిటిక్స్ లో అడుగుపెట్టి.. కేటీఆర్ ను యువరాజుగా పట్టాభిషిక్తున్ని చేస్తాడంటూ తేల్చి చెప్పాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ఫేవర్‌గా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కూడా జగన్‌కు ఫేవ‌ర్‌గా కామెంట్స్ చేశాడు వేణు స్వామి.

Popular Astrologer Predicts Pawan's Divorce In 2024! | Popular Astrologer  Predicts Pawan's Divorce In 2024!

తాజాగా సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి సంచలన ప్రకటన చేశాడు. తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కళ్యాణ్ మోసపోవడం ఖాయమని.. పవన్ ఎప్పటికీ సీఎం కాలేడు అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతటితో ఆగకుండా పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటిషన్ అంటూ.. ఎన్నికల్లో కూటమి షాక్ తప్పదంటూ వివరించాడు. జాతకరీత్యా చంద్రబాబుకు కొంచెంసేపు కూడా పడదని.. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ ది ఉత్తరాషాఢ మకర రాశి.. వీళ్లందరికీ పొత్తు కుదరదని జాతక విశ్లేషణ వివరించాడు. వీళ్ళ జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదంటూ చెప్పిన వేణు స్వామి పవ‌న్‌తో తనుకు ఎలాంటి గొడవలు లేవని కేవలం ఆయన జాతకం ప్రకారం జోష్యం చెబుతున్నానంటూ వివరించాడు.

Amravati issue: Pawan Kalyan meets Nadda amid talk of alliance – India TV

అయితే ఇదే విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలోనూ ఆయన జాతకం అసలు బాగోలేదని రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే యోగ్యతే లేదంటూ బల్లగుద్ది చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందంటూ ఆయన వివరించాడు. కానీ రికార్డ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ సాధించింది. రేవంత్ సీఎం గా నిలిచాడు. ఆరు నెలల పాటు తన పదవి కాలాన్ని కొనసాగించాడు. సార్వత్రిక ఎన్నికల సైతం మెజారిటీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో వేణు స్వామి జోష్యం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే వేణు స్వామి పవన్ పర్టికులర్ గా ఫెయిల్యూర్ నేత అని చెప్పడంతో జనసేన అభిమానులు అతనిపై ఫైర్ అవుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవంటూ వేణు స్వామి జ్యోతిష్యం ఎప్పుడు ఫలించదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.