“తూ..ఛీ..నీ బ్రతుకు”..కలర్స్ స్వాతి సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

కలర్స్ స్వాతి… ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటించి మెప్పించింది . కలర్స్ స్వాతి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత అమాయకంగా ఉంటుందో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా డేంజర్ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నాటి గా ఉంటుంది . చాలా చాలా క్యూట్ గా ఉంటుంది .

ఈ సినిమాను ఇప్పటికీ జనాలు యూట్యూబ్లో ప్లే చేసి చూస్తున్నారు అంటే మాత్రం కలర్స్ స్వాతి నటన కోసం అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మెప్పించింది. అష్టాచమ్మా ద్వారా ఫస్ట్ బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకునింది కలర్స్ స్వాతి . ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది . కార్తికేయ ,స్వామి రారా ,త్రిపుర ,మిరపకాయ్ ,సంఘర్షణ అనే సినిమాలో నటించి మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది . స్వాతి పర్సనల్ విషయాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి . అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఓపెన్ గానే చెప్పేసింది. తాజాగా మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది స్వాతి . రీసెంట్గా స్వాతి తన బంధువులు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తూ ఇన్స్టా స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసింది .

అయితే దీనికి ఒక నెటిజన్ రెచ్చిపోయి మరి కామెంట్ పెట్టారు. “చీ ఛీ నీ బ్రతుకు” అంటూ రిప్లై ఇచ్చారు . జనరల్ గా ఇలా మాట్లాడితే హీరోయిన్స్ కి కోపం వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు . కానీ స్వాతి టూ స్పెషల్ అందుకే సైలెంట్ గానే ఇచ్చి పడేసింది . “నాకు కూడా కొన్నిసార్లు అలానే అనిపిస్తూ ఉంటుంది జీరో పోస్ట్ ఛాంపియన్స్” అంటూ కౌంటర్ ఇచ్చింది .దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి..!