మామిడి పండ్లను అదేపనిగా లాగించేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..?!

పండలో రారాజు మామిడి.. దీనిని ఇష్టపడని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. మామిడి ఆనందం వేసవిలో మాత్రమే లభిస్తుంది. ఎండాకాలంలో మామిడికాయలు అందుబాటులో ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మామిడి పండ్లను తినడానికి.. వాటి రుచి ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అయితే తరచుగా మామిడి పండు తినడానికి ఇష్టపడే వాళ్ళు ఈ జాగ్రత్తలు వహించక తప్పదు. లేదంటే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మామిడిపండుతో పాటు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి. మామిడి పండు తో కలిపి తినకూడని ఆహారాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Raw Mango Curd Rice

పెరుగును మామిడి పండు తో కలిపి తినకూడదట. కొంతమంది మామిడిపండును పెరుగుతో కలిపి తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ ఆహారం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని.. కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో పెరిగి కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణుల‌ చెప్తున్నారు. రాత్రి భోజనంలో మామిడిపండు తింటే కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదట. మామిడి, శీతల పానీయాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పై తీవ్ర ప్రభావం చూపుతుందని.. జలుబు గ్యాస్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణ మామిడి పండ్లను రాత్రి భోజనంలో లేదా లంచ్ లో తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

Fact check: Should you drink cold drink after eating mangoes? | Health News - The Indian Express

మామిడి పండు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్ అసలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. మామిడికాయతో కాకరకాయను అసలు తీసుకోకూడదు.. మామిడికాయతో కాకర తినడం వల్ల అది పాయిజన్ గా మారి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. పచ్చిమిర్చి, మామిడికాయలతో కలిపి తినకూడదని నిపుణులు చెప్తున్నారు. అలా మామిడి, పచ్చిమిర్చి కలిపి తినడం వల్ల వెంటనే కడుపులో చికాకు, విరోచనాలు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మామిడి పండు తిన్న వెంటనే చాలామందికి నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది. అయితే మామిడి తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీతీ సమస్యలు తలెత్తుతాయి.