బాల‌య్య పై త‌మిళ్ స్టార్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌.. అలా చేస్తే అస‌లు స‌హించ‌డంటూ..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హ్యాట్రిక్ హిట్లతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలంద‌రిలోను మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక బాలయ్య ఆన్‌ స్క్రీన్ పై ఎంత క్రోధంగా ఉంటారో.. ఆఫ్ స్క్రీన్ లోను అంతే కోపిస్టు అని.. ముందు వెనుక ఆలోచించకుండా ఎవరినైనా కొట్టేస్తాడని పలు వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దానిని వైరల్ చేస్తూ ఉంటారు. అయితే వాస్త‌వానికి బాలకృష్ణ చాలా శాంతంగా.. మంచితనంగా ఉంటారట ఆయన ఎవరితో స్నేహం చేసిన ప్రాణం పెట్టేంత రేంజ్ లో ఆయన ఫ్రెండ్షిప్ ఉంటుందని.. అలాగే ఎవరితో అయినా తేడా వస్తే అదే రేంజ్ లో వారికి పనిష్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

Balakrishna KS Ravikumar Ruler movie new update | Galatta

అలా సెట్ లో కూడా బాల‌య్య ఇలా కొట్టడాలు చేవ్తార‌ని.. తాజాగా ఓ ప్రముఖ డైరెక్టర్ చేసిన షాకింగ్ కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తమిళ్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ బాలయ్యతో పలు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో బాలయ్య జై సింహ, రూలర్ సినిమాలు రూపొందించాడు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్‌లుగానే నిలిచాయి. అయితే ఇటీవల కేఎస్ రవికుమార్ గార్డియన్ తమిళ్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ బాలయ్య గురించి చెప్పుకొచ్చాడు. బాలయ్య షూటింగ్ సెట్ కి వచ్చిన తర్వాత ఎవరైనా ఆయనను చూసి నవ్వితే అసలు తీసుకోలేరని.. వెంటనే కోపం వచ్చేస్తుందని.. నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొట్టడానికి కూడా సిద్ధమవుతారని వివ‌రించాడు.

అలా ఓ మూవీ షూటింగ్ టైంలో నా అసిస్టెంట్ శర్వణ‌న్‌ కి ఫ్యాన్ తిప్పమని నేను చెప్పాను. అతడు బై మిస్టేక్ బాలయ్య వైపు ఫ్యాన్‌ను తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు జరిగింది. అది చూసి శ‌ర్వ‌ణ్‌ నవ్వేసాడు. వెంటనే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ గట్టిగా అరిచాడు.. మళ్ళీ ఆయన శ‌ర్వ‌ణ‌న్‌ని ఎక్కడ కొడతాడు అని నేను వెళ్లి మన అసిస్టెంట్ డైరెక్టర్ సర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా బాలయ్య కోపం తగ్గకపోవడంతో నోరు మూసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నేను అరిచాను. అప్పుడు బాలకృష్ణ కాస్త కూల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం రవికుమార్ ఎంతో ఫన్నీగా వివరించారు.