లాస్ట్ మినిట్లో షాకింగ్ ట్విస్ట్.. ఒకే ఒక్క దెబ్బతో ఏపీ రాజకీయాలను టర్న్ చేసిన చిరంజీవి..!

ఏపీ రాజకీయాలను లాస్ట్ మూమెంట్లో టర్న్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే చిరంజీవి సినిమాల్లో నటిస్తూనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అయితే అది ఎలా లాస్ట్ మినిట్ లో బ్లాస్ట్ అయిపోయిందో మనకు తెలుసు . ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది. నాగబాబు భార్య.. నాగబాబు.. నాగబాబు కొడుకు అందరు కూడా జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు . రీసెంట్గా సాయిధరమ్ తేజ్ సైతం జనసేన పార్టీకి ఓటు వేయండి అంటూ పిఠాపురంలో ప్రచారం చేశారు. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేస్తారా అంటూ చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేసారు మెగా అభిమానులు.

ఆ మూమెంట్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయండి అని ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ ..”నా తమ్ముడు చాలా మంచివాడు ..ఎవరైనా సరే అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవ చేయాలి అని చూస్తారు.. కానీ నా తమ్ముడు అధికారంలోకి రాకముందు నుంచే తన సొంత డబ్బులతో జనాలకు సేవ చేస్తున్నాడు.. నా తమ్ముడు అని చెప్పుకోవడం కాదు నిజంగా జనాలకు ఉపయోగపడే మనిషి ..మా అమ్మకి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ..నా తమ్ముడిని తిట్టినప్పుడు ఎవరైనా ఆ మాటలు మాకు బాగా హార్టింగ్ అనిపిస్తాయి.. మా అమ్మ కూడా చాలా సార్లు బాధపడింది. కానీ నేను మా అమ్మకి చెప్పాను ..నీ కొడుకు ఎంతోమంది తల్లుల కలలను నెరవేర్చడానికి కష్టపడుతున్నారు ..మనం ఆ విషయంలో సంతోషంగా ఉండాలి..”

“దేశం కోసం పోరాడే జవాన్లకు ఎంత ఖర్చు పెట్టాడో ఎంత సహాయం చేశాడో పవన్ కళ్యాణ్ మన అందరికీ తెలుసు ..బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ ఇష్టంగానే పాలిటిక్స్ లోకి వచ్చాడు ..కచ్చితంగా నేటి సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి ఓ నాయకుడు ఉండాలి. పిఠాపురంలో జనసేనకు ఓటు వేయండి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి.. మీకు సేవకుడిగా జనసైనికుడిగా అండగా నిలబడతాడు ..పిఠాపురం వాస్త్య్వులకు నమస్కారం ..గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి నా తమ్ముడిని గెలిపించండి ..జైహింద్ “అంటూ చిరంజీవి వీడియోని ముగించారు . ఒకే ఒక్క వీడియోతో ఏపీ రాజకీయాలు టర్న్ అయిపోయాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న చిరంజీవి ఒక్క వీడియోతో జనసేన పార్టీకి ప్రచారం చేస్తూ జనసేన క్రేజ్ ని పెంచేశారు. ఇప్పుడు 80% జనాలు జనసేన కచ్చితంగా గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి..!!