ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుంటాడు అని ఆ డైరెక్టర్ కి ముందే తెలుసా..? హీట్ పెంచేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

ఉదయ్ కిరణ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరో ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు ఉదయ్ కిరణ్ అంటే అప్పట్లో అమ్మాయిలు ఎలా పడి చచ్చిపోయేవారో కూడా మనకు తెలిసిందే. బుక్స్ లో పేపర్ లో ఉదయ్ కిరణ్ ఫొటోస్ వస్తే ఆ పేపర్స్ ని కట్ చేసుకొని దాచుకునేవారు. మన ఇండస్ట్రీలోని టాప్ టాప్ బడా హీరోల కూతుర్లు కూడా ఉదయ్ కిరణ్ ను ఓ రేంజ్ లో లైక్ చేశారు.

కొంతమంది నిజంగానే ప్రేమించారు .. ఆ విషయం కూడా మనకు తెలుసు . కాగా ఉదయ్ కిరణ్ చాలా చిన్న ఏజ్ లోనే కొన్ని కారణాల చేత సూసైడ్ చేసుకొని మరణించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దర్శకుడు వి ఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్ చాలా చాలా మంచి మనిషి . చాలా చిన్న ఏజ్ లోనే సక్సెస్ అందుకున్నాడు .

అయితే దాని హ్యాండిల్ చేసుకోలేకపోయాడు అని చెప్పాలి. కొన్ని ప్లాప్స్ పడిన తర్వాత ఇబ్బందులు రావడంతో తట్టుకోలేకపోయాడు. అతడికి ముందు నుంచే అలాంటి సూసైడ్ ఆలోచనలు ఉన్నాయని నాకు తెలుసు . అయితే మేమంతా మాట్లాడి ఉదయ్ ని రిఫ్రెష్ చేశాము.. కానీ ఉదయ్ కిరణ్ మా మాట పట్టించుకోకుండా సూసైడ్ చేసుకునేసాడు అంటూ విఎన్ ఆదిత్య సంచలన కామెంట్స్ చేశారు .సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!