షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన మారుతి.. ప్రభాస్ ఫ్యాన్స్ గుండెలు బద్ధలు అయిపోయే న్యూస్ ఇది..!

ప్రెసెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి పై గుర్రుగా ఉన్నారు అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . దీనికి ది రాజసాబ్ అంటూ నామకరణం కూడా చేశారు. ఈ సినిమా షూట్ కూడా సగానికి పైగానే పూర్తయింది అంటూ ప్రచారం జరుగుతుంది . లుంగీకట్టులో ప్రభాస్ కి సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు . ఈ లుక్ అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకునింది. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో జనాలు మనకి బాగా తెలిసిందే.

అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు ఎక్కడా కూడా ఈ సినిమాకి సంబంధించిన ఊసే లేదు . దానికి తోడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాపై కాకుండా వేరే దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఈ సినిమాని చాలామంది మర్చిపోయారు. కాగా రీసెంట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి రాజా సాబ్ సినిమాని సంక్రాంతి కానుకగా 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారట .

కానీ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి విరమణ తీసుకున్నట్లు తెలుస్తుంది . రాజా సాబ్ 2025 వేసవికి పుష్ చేసే అవకాశం ఉందట . దానికి కారణం సినిమా షూట్ ఆలస్యం కావడమే. వేరే సినిమాలు షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రెసెంట్ రాజా సాబ్ కు కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఆ కారణంగానే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అంటూ భావిస్తున్నారట . దానికి తోడు మారుతీ కూడా ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండకపోవడంతో ప్రభాస్ అసహనానికి గురవుతున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడిపోతున్నాడు. మారుతి దర్శకత్వం లో ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేసే జనాలు డీలా పడిపోయారు..!!