“ఆ యాంకర్ ను చెప్పుతో కొట్టాలి”.. రష్మీ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ ని బూతులు తిట్టే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు ట్రోలింగ్ చేస్తూ రకరకాల మీమ్‌స్ తో వైరల్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పై ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది . యాంకర్ రష్మీ తీరుపై మండిపడ్డాడు . మనకు తెలిసిందే యాంకర్ రష్మీ అనిమల్ లవర్ . జంతువులను ఏదైనా సరే హింసిస్తూ ఉంటే అస్సలు ఊరుకోదు .వాళ్ళ తాట తీసేస్తుంది .

సోషల్ మీడియా వేదికగా పలు పోస్టు పెడుతుంది . తాజాగా యాంకర్ రష్మీ అదేవిధంగా చేసింది ఒక ఎద్దును హింసిస్తూ ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో షేర్ చేసింది . “ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి..?” అంటూ ఘాటుగా స్పందించింది .అయితే దీనికి ఒక నెటిజెన్ స్పందించాడు. ” నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ.. బయట జనాలు ఏ విధంగా ఉన్నారో తెలుసా? అమ్మాయిలను టార్చర్ చేస్తున్నారు ..బట్టలు లేకుండా హింసిస్తున్నారు.. మానభంగం చేస్తున్నారు ..వాళ్ల గురించి నువ్వు ఏ మాత్రం స్పందించవా..? కేవలం అనిమల్స్ పై మాత్రమే స్పందిస్తావా..?” అంటూ మండిపడ్డారు .

దీనికి యాంకర్ రష్మీ కూడా కౌంటర్ ఇచ్చింది. మూగజీవులను ప్రేమించలేని వాళ్ళు కూడా మనుషుల్ని ఎలా ప్రేమిస్తారు? ఈరోజు ఆ ఎద్దుకు పట్టిన గతే.. రేపు మీ పిల్లలకు కూడా పడుతుంది.. బ్రెయిన్ పెట్టి ఆలోచించు ” అంటూ కూసింత ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పై ఆ నెటిజన్ చేసిన కామెంట్..దాని రష్మి ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది..!