ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తాం.. రాకింగ్ రాకేష్ పై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. వెంటనే వీడియో డిలీట్.. ఏం జరిగిందంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనాని అధినేతగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. కమెడియన్ పృథ్వీరాజ్, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ ఆది, రాంప్రసాద్, గెటప్ శీను, సుధీర్, సన్నీ లాంటి ఎందరో కమెడియన్లు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతూ అతని వైపు అండగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుగా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ త‌మ‌ అభిప్రాయాన్ని తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే యాంకర్ శ్యామల వైసీపీలో చేరడంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఆమె పర్యటించి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేసింది. కాగా ఈ జబర్దస్త్ కమెడియన్ లోనే ఒక్కడైనా రాకింగ్ రాకేష్ కూడా ఒకప‌ట్టి జడ్జి రోజాకు మద్దతుగా నిలిచి నగరి నియోజకవర్గాన్ని పర్యటించాడు. ఈ నేపథ్యంలో ఒక ముసలామిడతో ఆయన మాట్లాడుతూ.. నీ ఓటు ఎవరికి అవ్వ అని ఆమెను అడిగాడు. ఆమె ఇంటికి సమయానికి పెన్షన్, రేషన్ ఇస్తున్నాడు వైయస్ జగన్ కి నా ఓటు అంటూ జగన్‌కు అనుకూలంగా మాట్లాడింది. మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి అన్ని వైసీపీ పార్టీకే వేస్తామంటూ ఆ వృధ్ధ మహిళ వివరించింది. ఆ వీడియోను రాకింగ్ రాకేష్ త‌న సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.

Rakesh Jabardasth : Biography, Age, Movies, Family, Photos, Latest News -  Filmy Focus

వైసీపీకి మద్దతుగా రాకింగ్ రాకేష్ పోస్ట్ చేసిన ఆ వీడియో పై జనసైనికులు మండిపడ్డారు. పవ‌న్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నీకు.. ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తామంటూ పలు కామెంట్స్ తో బెదిరింపులకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వెంటనే రాకేష్ ఆ వీడియోను డిలీట్ చేయించాడు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో.. జనసేనకు అంతమంది జబర్దస్త్ కమెడియన్స్ మద్దతు పలికినప్పుడు లేని ఇబ్బంది.. కేవలం ఒకే ఒక్క జబర్దస్త్ కమెడియన్ వైసిపికి ప్రచారం చేస్తే వచ్చిందా.. అంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ ఫ్యాన్స్.