ఆర్య@ 20 ఏళ్లు: బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న ఆ ఇద్దరు తెలుగు హీరోలు వీళ్లే..!

ఆర్య .. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా. అంతేనా దిల్ రాజు అదేవిధంగా సుకుమార్ కెరియర్ని సెట్ చేసిన సినిమా . ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా చిత్ర బృందం ఇవాళ హైదరాబాదులో ఘనంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రెస్ మీట్ కు ఆర్య సినిమా యూనిట్ మొత్తం అటెండ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఆర్య సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. నిజానికి ఆర్య కథ రాసుకున్నప్పుడు సుకుమార్ హీరోగా మహేష్ బాబును అనుకున్నారట. కథ కూడా ఆయనకు వివరించారట. కానీ మహేష్ బాబుకు ఎక్కడో వన్ సైడ్ లవ్ అనేసరికి కాన్సెప్ట్ అర్థం కాక రిస్క్ చేయలేక రిజెక్ట్ చేశారట .

ఆ తర్వాత ప్రభాస్ కి ఈ కథను వివరించారట . అయితే ప్రభాస్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశారట . ఫైనల్లీ అల్లు అర్జున్ వద్దకు ఆ కథ చేరింది . ఏ మాటకు ఆ మాట అల్లు అర్జున్ ఈ కథలో నటించలేదు జీవించేసాడనే చెప్పాలి . ఓ రేంజ్ లో నటించేసి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేసాడు. ఇప్పటికి బన్నీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా అదే చెప్పాలి. ప్రసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు ఈ హీరో..!!