కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడాకులు తీసుకోలేదా..? ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన మెగా డాటర్..!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మెగా డాటర్ శ్రీజ గురించి అని చెప్పాలి . మెగా డాటర్ శ్రీజ హీరోయిన్ కాదు పెద్ద తోపైన సెలబ్రిటీ కూడా కాదు ..కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ఆమెను ట్రోల్ చేస్తూనే ఉంటారు . దానికి కారణం మనకు తెలిసిందే . ఆమె రెండు పెళ్లిళ్లు రెండు విడాకులు . మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ విడాకులు తీసుకుంది. ఏదో టైం బాగోలేదు చిన్నవయసులో తెలియక తప్పు చేసింది అనుకున్నారు . ఆ తర్వాత పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకుంది. అయితే కళ్యాణ్ దేవ్ తో కూడా విడాకులు తీసుకుంది అన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

వీరిద్దరు దూరం గా ఉండడం అందుకు ప్రధాన కారణం . పరోక్షకంగా ఒకరిని నిందిస్తూ ఒకరు పోస్ట్లు పెట్టడం కూడా దానికి ఆజ్యం పోసింది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో శ్రీజ ను ఓ నెటిజన్ సలహా అడిగింది. “నాకు ఒక సలహా ఇస్తారా..? నా భర్త నుండి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను ..తీసుకోమంటారా..?” అంటూ ప్రశ్నించింది . శ్రీజ కూడా అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ” నువ్వు అతగాడితో సంతోషంగా ఉంటాను అంటే విడాకులు తీసుకోకు.. లేదంటే తీసుకో ..అది నీ ఇష్టం” అంటూ చాలా బోల్డ్ మెచ్యూరిటీ ఆన్సర్ ఇచ్చింది .

అంతేకాదు తన డివర్స్ పై పరోక్షంగా స్పందిస్తూ ..”బ్యూటీ పార్లర్ కి వెళ్లడం ..స్పా కి వెళ్లడం.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవడం తప్పా..? సెల్ఫ్ కేర్ లవ్. మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము ధైర్యం మనకి లేదా..? అంటూ ప్రశ్నించింది. అంతేకాదు శ్రీజ మాటలు బట్టి శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోలేదు అని.. కేవలం దూరం దూరంగా మాత్రమే ఉన్నారు అని వాళ్ళిద్దరి మధ్య సం పర్సనల్ ఇష్యూస్ వచ్చాయి అని .. ఆ కారణంగానే ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు శ్రీజ మాట్లాడిన మాటలకు ఇప్పుడు మెగా ఫాన్స్ కి బిగ్ డౌట్ వచ్చేసింది. అసలు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారా..? లేదా ..?అంటూ వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు. ఒక్క పోస్టుతో శ్రీజ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది..!