అలా మాట్లాడితే చెప్పులతో కొడతారు.. యాంకర్ శ్యామలపై స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్..?!

తెలుగు బుల్లి తెర‌ యాంకర్లలో శ్యామ‌లా ఒకటి. తన వాక్ చాతుర్యంతో మంచి పాపులారిటి ద‌క్కించుకున్న ఈ అమ్మడు.. యాంకరింగ్ మాత్రమే కాదు.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల‌లో మెప్పించింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఏపీ ఎన్నికలు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని పార్టీలకు మద్దతుగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ప్రచారాల్లో పాల్గొంటూ జననికి షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారంలో దిగింది.

Anchor Shyamala: Jabardasth Team Pressured To Campaign

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల జనసేన, టీడీపీ పేర్లు ఎత్తకుండానే కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై పలువురు సెలబ్రిటీస్ జనసేన, టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో యాంకర్ శ్యామల కామెంట్స్ పై సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నేను చేసిన లౌక్యం సినిమాలో ఆమె చిన్న క్యారెక్టర్ చేసిందని.. రోజా, శ్యామల లాంటి వారు వేరువేరుగా మాట్లాడిన వాళ్ళిద్దరూ ఒకటే. విశాఖ చాలా సుందర ప్రాంతమా.. అక్కడ ప్రతి వీధి దుర్గంధాలు వెదజల్లుతుంది. ఇక రెల్లి, వీధి మత్స్యకారులు నివసించే ఏరియా అయితే దారుణాతి దారుణంగా ఉంది.

Prudhvi Raj On Mega Family Issue | cinejosh.com

ఈ ప్రాంతంలో అడుగు తీసి అడుగుపెట్టే విధంగా కూడా పరిస్థితులు లేవు. కానీ శ్యామల అది సుందర ప్రాంతం.. చాలా బాగా అభివృద్ధి చేశారు అంటూ వివరించింది. నువ్వు కానీ అక్కడ ప్రజలకు కనిపిస్తే అక్కడ జనం నిన్ను అలానే కొడతాం అంటున్నారు.. అవంతి శ్రీనివాస్ నీకు విశాఖ గురించి ఎక్కువ చెప్పమంటూ అధిక పేమెంట్ ఇచ్చారా ఏంటి.. అంటూ సెటైర్లు వేశాడు. పదేళ్లు వైసీపీతో ఉన్న నాకు తెలియదా.. ఆ పార్టీ గురించి.. అది ఒక టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్ అంటూ పృధ్వీరాజ్ కామెంట్స్ చేశాడు. ఇక ఆయన ప్రస్తుతం జనసేన, టీడీపీకి సపోర్టుగా ప్రచారం చేస్తున్నాడు.