నిఖిల్ కి అంత సీన్ ఉందా..? ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా..?

నిఖిల్ ..ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా వచ్చిన మరో హీరో . ఒక చిరంజీవి ..ఒక రవితేజ లా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా కష్టపడుతున్నాడు. మరీ ముఖ్యంగా హ్యాపీడేస్ సినిమాలో నటించిన నిఖిల్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటిస్తూ క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే కార్తికేయ అని చెప్పాలి . కార్తికేయ 2 తో ఆయన పాన్ ఇండియా లవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇప్పుడు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు .

ప్రజెంట్ నిఖిల్ స్వయంభు అనే సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే తండ్రి అయిన నిఖిల్ ఓ పక్క బిడ్డతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మరొక పక్క సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు . ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ స్వయంభు సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం ఒక్క సీన్ తెరకెక్కించడానికి 8 కోట్లు ఖర్చు పెట్టారట . 12 రోజులపాటు దాదాపు 700 మందితో ఈ సీన్ ను తెరకెక్కిస్తున్నారట . దీంతో టైర్ 2 హీరో అయిన నిఖిల్ కోసం ఏకంగా 8 కోట్లు పెట్టి భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నారా..? అనే న్యూస్ వైరల్ గా మారింది. స్వయంభు మొత్తం బడ్జెట్ ఇంకా ఎంత ఉంటుందో అంటూ ఆశ్చర్యపోతున్నారు . సాధారణంగా ఇలాంటి స్టార్ బడ్జెట్.. పెద్దపెద్ద హీరోలకి పెడుతూ ఉంటారు . హీరో నిఖిల్..ని నమ్మి మేకర్స్ ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి కొంతమంది ఆయనకు అంత సీన్ ఉందా..? అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు..!!