మన డార్లింగ్ సినిమా వస్తుందంటే సైలెంట్ గా సైడు అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!!

ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న న‌టుడు ఎవరంటే అందరికీ టక్కన గుర్తుకు వచ్చేది ప్రభాస్. ప్ర‌భాస్ సినిమాలు సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా 300 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా తెర‌కెక్కుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. మొదట కేవలం టాలీవుడ్ సౌత్ లో మాత్రమే చాటుకున్న ప్రభాస్ క్రేజ్.. బాహుబలి తో ఆకాశాన్ని అంటింది. తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ రోజురోజుకు మరింత పాపులారిటి పెంచుకుంటున్న ప్రభాస్.. బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయాడు.

Dunki vs Salaar advance box office: Shah Rukh Khan's comedy drama has clear  upper-hand over Prabhas' epic actioner, leads by over Rs 1 crore |  Bollywood News - The Indian Express

అయినప్పటికీ అతని క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ప్రభాస్ వునికి బాలీవుడ్ హీరోలు అందరికీ వణుకు పుట్టిస్తుంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే.. దాని రిలీజ్ డేట్ ఏంటో తెలుసుకుని దాని దరిదాపుల్లో కూడా వారి సినిమాలు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభాస్‌ను తట్టుకుని నిలబడడం తమ సినిమాల వల్ల కాదని అన‌ఫ్షియ‌ల్‌గా డిక్లేర్ చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాను తీసుకుంటే సలార్‌ సినిమాతో రిలీజ్ అయింది ఢంకీ. ఈ సినిమా డిజాస్టర్ కాకపోయినా యావరేజ్ గా పర్వాలేదు అనిపించింది. అదే టైంలో సలార్ అద్భుత సక్సెస్ అందుకుంది. దాంతో షారుక్ లాంటి బాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరో కూడా ప్రభాస్ ముందు తేలిపోయాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Singham Again | 31 Interesting Facts | Ajay Devgn | Akshay Kumar | Kareena  Kapoor | Rohit Shetty

తర్వాత మరో స్టార్ హీరో ఎవరు ప్రభాస్ సినిమా టైంలో వారి సినిమాలను రిలీజ్ చేయాలని భావించడం లేదట. ఇప్పుడు ప్రభాస్ కల్కి, రాజాసాబ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతో మరోసారి బాలీవుడ్ హీరోలు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీల కోసం ఎదురు చూస్తున్న వారు తేదీ ప్రకటిస్తే వారి సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. ముఖ్యంగా అజయ్ దేవగణ్‌ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింగం అగైన్‌ మూవీని ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ తర్వాత అనౌన్స్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట.