బ‌ర్త్ డే స్పెష‌ల్‌.. మ‌రో పాన్ ఇండియా మూవీలో జాన్వీ ఫిక్స్‌.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్..!!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆమె నటించిన సినిమా ఏది ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందించలేదు. అయినా ఈమెకు పాన్‌ ఇండియన్ స్టార్ గా పాపులారిటి దక్కించుకున్న.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాలో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులు కూడా పరిచయం అవడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ.

Janhvi Kapoor Tamil Debut Film With Kamal Hassan - Sakshi

అయితే ఇంకా ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయిన కాకముందే మరో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం జానీ నటిస్తున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఇది అక్టోబర్ కు వాయిదా పడింది. దీంతో జాన్వీ అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే.. చరణ్ – బుచ్చిబాబు స‌నా కాంబోలో తెరకెక్కుతున్న RC16 లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.

కొద్దిరోజుల క్రితం జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని వివ‌రించాడు. అయితే అదే విషయాన్నిజాన్వీ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ మూవీ మేక‌ర్స్‌ అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేసి మరీ బర్త్డే విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ తో వేరే లెవల్లో క్రేజ్‌ సంపాదించుకున్న చరణ్, తారక్‌ లాంటి ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల్లోనూ జాన్వికపూర హీరోయిన్ కావడం విశేషం. నిజంగా ఇది జాన్వి లక్ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఏది కిక్ అయిన క్లిక్ అయినా జాన్వి ఫేట్ మారిపోతుంది.