స్టార్ డైరెక్టర్ కొరటాల శివపై కేసు నమోదు.. కారణం ఇదే..!!

శ్రీమంతుడు సినిమా మూవీ కాపీరైట్స్ వ్యవహారం పై కేసు నమోదు అయ్యి ఆ కేసుకు హైకోర్టులో సంచల తీర్పు ఇచ్చారు. ఫోర్జరీ మోసం అభ‌యోగాలకు ఆధారాలు లేవని వివరించిన హైకోర్టు.. వాటిపై కేసు కొనసాగింపు చెల్లదని వివరించింది. కేవలం దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి.. జ‌స్టిస్ కే సురేందర్ రెడ్డి తీర్పునిచ్చాడు. 8 మంది రచయితల కమిటీ శ్రీమంతుడు మూవీ నవల కాపీఅని తెల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది మోసం, ఫోర్జరీ కిందకి రాదని స్పష్టం చేశాడు న్యాయమూర్తి.

Watch Srimanthudu Full HD Movie Online on ZEE5

కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాని నిర్మించడంతోపాటు కథ‌, రచన, స్క్రీన్ ప్లేకు కూడా దర్శకుడు మ‌ని పే చేయడం కారణంగా ఆయనే దీనికి బాధ్యత వహించాలని స్టేట్మెంట్ ఇచ్చారు. నిర్మాతలపై కేసును కొనసాగించడానికి వీలులేదని స్పష్టం చేశారు. చచ్చేంత ప్రేమ అనే ఓ నవలను శ్రీమంతుడి పేరుతో కొరటాల చిత్రీకరించాడని.. కథా ర‌చయితగా మరొకరి పేరు ఉండడంతో దర్శకుడు కొరటాలపై, నిర్మాత యార్నేని రవి, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్లపై కూడా రచయిత శరత్‌చంద్ర అలియాస్ ఆర్ డి విల్సన్ క్రిమినల్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టేయాలని వాళ్లంతా వేరువేరుగా కోర్ట్‌లో పిటిషన్లు వేశారు.

Mahesh's Director condemns Copy Cat allegations

ఇదే టైంలో వారిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేసి ఉత్తర్వులు జారిచేయాలని శరత్‌చంద్ర పిటీషన్ వేశాడు. వీటన్నిటిని కలిపి హైకోర్టులో విచారణ చేసిన‌.. హైకోర్టు న్యాయవాది ప్రధాన కథలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి సొంత కథ అని చెప్పుకోవడం కూడా కాపీ రైట్స్ ఉల్లంగ‌న అవుతుంద‌ని.. రచయిత కమిటీ నిర్ణయం ప్రకారం ఇది కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశాడు. కాగా నిర్మాత, మ‌హేష్ ఎంట‌ర్‌టైన్మెంట్ పై ఉన్న కేసులు మూసివేశారు. అదేవిధంగా ఫోర్జరీ, మోసం కూడా అవుతుంది అన్న వీల్సన్‌ పిటిషన్ కూడా కొట్టేశారు. దర్శకుడు కొరటాల మాత్రం కాపీరైట్ పై విచారణ ఎదుర్కొక తప్పదని న్యాయమూర్తి వెల్లడించాడు.