అల్లు అర్జున్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమాని.. ఆ అమ్మాయి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు (వీడియో)..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్న బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీ కూడా ఏర్పడింది. దీంతో తన రాబోయే సినిమాల కోసం అల్లు అర్జున్ మరింతగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతనికి సర్ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటారు.

గతంలో పుష్ప ది రైస్ రిలీజ్ సందర్భంగా పుష్పరాజ్ ఫోటోను ఆర్ట్‌ వేసి ఓ అభిమాని అల్లు ఫ్యాన్స్ అందరికీ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం మరో అభిమాని ఊహించని విధంగా అల్లు అర్జున్ ఫాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై అభిమానంతో అయినా పిక్ టాటూగా వేయించుకుంటూ ఉంటారు. లేదంటే పెన్సిల్ ఆర్ట్‌,లేద‌దా వేరే విధంగా తమ అభిమానాన్ని బన్నీపై చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఆర్టిస్ట్‌ మాత్రం తన అభిమానాన్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చూపించింది. ఏకంగా నీటిలో పుష్పరాజ్‌ తగ్గేదేలే ఫోటో ఆర్ట్‌గా వేసి చూపించింది.

ఇది అల్లు అర్జున్‌కే కాదు.. తన ఫ్యాన్స్ కి కూడా ఓ స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ పై ఓ అమ్మాయి చూపించిన ఆ అభిమానానికి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన హీరోయిన్గా.. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Dhrisha suroiwal (@dhrisha_suroiwal)