సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం… కుర్ర హీరోయిన్ మృతి..!

సినీ పరిశ్రమలో విషాదాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో మరణించడం జరుగుతుంది. ఇక ఈ ఏడాదిలో ఎక్కువ మృతుల సంఖ్య వెల్లుడైంది. ఒక్క టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు సైతం నిత్యం ఏదో ఒక కారణం వల్ల మృతి చెందుతూ ఉన్నారు.

ఇక ఈ క్రమంలోనే మరో సీనియర్ నటి కన్నుమూసింది. ఈమె కూడా పక్క ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళితే… కన్నడ సీనియర్ నటి అయిన లీలావతి ఈరోజు కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఈమె కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలలో కూడా నటించారు. మొత్తంగా లీలావతి 600 కి పైగా సినిమాలలో నటించారు. ఇక తెలుగులో అయితే ” మర్మయోగి, కార్తీకదీపం, ఇది కథ కాదు ” వంటి సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం ఈమె వయసు 87 ఏళ్ళు అయినట్లు తెలుస్తుంది.