నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో.. ఆ సీన్ విజయ్ రష్మిక రిలేషన్ గురించేనా.. !?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ తాజాగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటించింది . వక్కంత వంశీ చాలా టైం గ్యాప్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు . ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నితిన్ పర్ఫామెన్స్ టు కేక అంటున్నారు జనాలు .

అంతేకాదు శ్రీ లీల అందానికే పరిమితమైంది కానీ డాన్స్ చక్కగా వేసింది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు . ఈ క్రమంలోనే హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు నితిన్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు రకరకాల ప్రశ్నలతో విసిగిస్తారు. బాలకృష్ణకు నిజంగానే కోపమా ..? కోపం వస్తే నిజంగానే కొట్టేస్తాడా..? పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది..? అంటూ రక రకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రష్మిక మధ్యన ఏముంది..? నిజంగానే పెళ్లి చేసుకుంటారా..? అన్న ప్రశ్నలు వేస్తారు. ఆ టైంలోనే నితిన్ జులాయి మూవీలోని నేనెట్టకుంటే నీకేంటి అన్నాయ్ అనే పాటను పాడుతాడు . దీంతో ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు ..? ఎదుటి వాళ్ళు పర్సనల్ మ్యాటర్ మీకెందుకురా..? అనే రేంజ్ లోనే ఘాటుగా కౌంటర్ వేశాడు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది..!!