పొత్తుల కోసం జ‌గ‌న్ త‌హ‌త‌హ

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండున్న‌రేళ్లు ఉంది. అయితే ఇప్ప‌టి నుంచే 2019 ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌.. సొంతంగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి! ముఖ్యంగా వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా `సీఎం` పీఠాన్ని ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. సొంతంగా పోటీచేసేకంటే ఎవ‌రో ఒక‌రిని క‌లుపుకుని వెళితే సీఎం అయిపోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. అందుకే అటు జ‌న‌సేన‌, ఇటు వామ‌ప‌క్షాల‌తో పొత్తు కోసం […]

చంద్రబాబు దెబ్బకి జగన్‌ షాక్‌!

శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్‌ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. అయినప్పటికీ […]

జగన్‌ కొత్త గెటప్‌ వెనుక రాజకీయ కోణం

అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే […]

సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]

జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ […]

జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!

వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]

జగన్‌ కూడా ఛలో విజయవాడ 

ఆంధ్రప్రదేశ్‌ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]

వైఎస్‌ జగన్‌కి మార్కులు మైనస్సే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్‌ జగన్‌కి మైనస్‌ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్‌ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం […]