ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. […]

ఏపీలో వైకాపా-కాంగ్రెస్ క‌లుస్తాయా..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ఫ‌లితాలు దేశ‌రాజ‌కీయ ముఖ చిత్రాన్నేమార్చిన ఘ‌ట‌న‌లు గ‌తంలో చాలానే ఉన్నాయి. హ‌స్తిన పీఠాన్నికాంగ్రెస్‌కు దూరం చేసిన జాతీయ స్థాయి విప‌క్ష కూట‌మి ఏదైనా.. అందులో టీడీపీ పోషించిన కీల‌క పాత్ర‌ను గుర్తుకు తెచ్చేదే. ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీ పంతం ప‌ట్టి మ‌రీ రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించ‌డానికి కూడా టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పైనా.. ఆ పార్టీలో పేరుకుపోయిన క‌క్షే కార‌ణమ‌ని భావించేవారి సంఖ్య త‌క్కువేమీ కాదు.  రాష్ట్ర విభ‌జ‌న […]

స్నేహితుడితో జ‌గ‌న్‌కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్‌

తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కొంత‌కాలంగా క్రియాశీల‌క పాత్రను పోషిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే… లోకేష్‌కు మంత్రి ప‌ద‌వినిచ్చి పాల‌న‌లో మ‌రింత ముఖ్య పాత్ర వ‌హించే అవ‌కాశం ఇవ్వాల‌ని ఇటీవ‌ల‌ పార్టీ నుంచి గ‌ట్టి డిమాండే వ‌చ్చినా… ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌డం ఇష్టం లేని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..  ప్ర‌స్తుతానికి పార్టీ నేత‌ల‌కు సర్ది చెప్పి ఆ అంశాన్ని ప‌క్క‌న పెట్టారు. ఇదిలా ఉండ‌గా 2019 ఎన్నిక‌ల‌నాటికి అధికారం […]

2019 ఎన్నిక‌ల్లో గెలుపున‌కు జ‌గ‌న్ వ్యూహం ఇదే

ఏపీలోని ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిప‌రిస్థితిలోనూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. వాస్త‌వానికి 2014లోనే అత్య‌ధిక మెజారిటీతో వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని అంద‌రూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేష‌ణ‌లు, స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన డ్వాక్రా రుణ‌మాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ స‌వారీ చేయ‌డానికి, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అటు బీజేపీతో […]

జ‌గ‌న్ శ‌త్రువు గెడ్డం దీక్షకు మోక్షం

వైకాపా అధినేత జ‌గ‌న్‌కు పొలిటిక‌ల్ రైవ‌ల్ క‌డ‌ప టీడీపీ యువ నేత శాస‌న మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి.. ఎట్ట‌కేల‌కు త‌న గ‌డ్డం దీక్ష‌కు మోక్షం ల‌భించ‌డంతో ఆనందంతో ఊగిపోతున్నారు. త‌న దీక్ష ఫ‌లించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది త‌న ఒక్క‌డి విజ‌యం కాద‌ని, మొత్తంగా టీడీపీ విజ‌యంగా ఆయ‌న పేర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో వైఎస్ కు కంచుకోట వంటి ప‌లివెందుల‌లోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాల‌ని, ఆదిశ‌గా తాను మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స‌తీష్ చెబుతున్నారు. ఈ […]

క‌డ‌ప గ‌డ‌ప‌లో జ‌గ‌న్ ప‌ట్టు స‌డ‌లుతోందిగా..

క‌డ‌ప జిల్లా అంటే వైసీపీకి పెట్ట‌ని కోట‌.. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అక్క‌డ టీడీపీ స‌మ‌ర్థుల‌కోసం కాగ‌డా పెట్టి వెదికి మ‌రీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫ‌లితాలు మాత్రం జిల్లా వ‌ర‌కు వైసీపీకి అనుకూలంగా ఏక‌ప‌క్షంగా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మ‌రి. కాంగ్రెస్ సంప్ర‌దాయ ఓటు బ్యాంకు అంతా రాయ‌ల‌సీమ‌లో ప్ర‌త్యేకించి క‌డ‌ప జిల్లాలో ప్ర‌స్తుతం జ‌గ‌న్ వెంట న‌డుస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో […]

లైవ్‌షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

వైకాపా అధినేత జ‌గ‌న్ గురించి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు నేత‌లు చేసిన ప్ర‌చారాన్ని బ‌ట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోడ‌నీ, త‌న‌మాటే నెగ్గాల‌నే మొండి ప‌ట్టుద‌ల గ‌ల వ్య‌క్తి అని అనుకుంటారు అంద‌రూ. అదేవిధంగా త‌న‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండ‌ద‌ని, త‌న కింద ప‌నిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వ‌ర‌ని క‌ర్రీలో క‌రేపాకులా తీసి పారేస్తూ ఉంటార‌ని కూడా జ‌గ‌న్ గురించి వారు విప‌రీత ప్ర‌చారం చేశారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ […]

కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?

గ‌తంలో ఒక‌ద‌శ‌లో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైపోయిన ద‌శ‌లో… కేసీఆర్ ఉద్య‌మానికి స‌జీవంగా ఉంచేందుకు ఆలోచ‌న కంటే ఆవేశం ఎక్కువ‌గా ఉండే యువ‌త‌ను న‌మ్ముకున్నారు. తెలంగాణ‌లోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారిలో విభ‌జ‌న ఉద్య‌మ జ్వాల‌లు ర‌గిలించారు. వారితో పాటు ప్ర‌జా సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ సాయంతో ఉద్య‌మాన్ని మ‌లి ద‌శ‌కు తీసుకెళ్లి అంతిమంగా ల‌క్ష్యం సాధించ‌గ‌లిగారు. తాజ‌గా జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంశంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై […]

జ‌గ‌న్ స‌వాల్‌కు బాబు స్పందిస్తాడా..!

ఎప్ప‌టిక‌ప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రో స‌వాలు విసిరారు. ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని.. జ‌నం ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో తేల్చుకుందామ‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. పోలీసులు, ధ‌నం, బ‌లం, బ‌ల‌గం అంతా మీద‌గ్గ‌రే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్ర‌వాస ఆంధ్రుల‌తో సాక్షి టీవీలో నిర్వ‌హించిన లైవ్ షోలో జ‌గ‌న్ మాట్లాడారు. చంద్ర‌బాబుకు నైతిక విలువ‌లు లేవ‌ని, అవినీతిలో కూరుకుపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న […]