జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా ఇప్పుడు YS వీర విధేయులంతా జగన్ పార్టీ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.వీరిలో ముక్యంగా మాజీ MP లు ఉండవల్లి,కోట్ల,హర్ష కుమార్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.వీరి చేరిక ఎలా ఉన్నా YS తన ఆత్మగా చెప్పుకునే తన ఆప్త మిత్రుడు KVP మాత్రం YS మరణానంతరం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.ఎప్పుడో అడపాదప తప్ప ఆయన బయటికి కనిపించింది కూడా తక్కువే.

అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే కేవీపీ జగన్ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.అదే గనుక జరిగితే జగన్ కు రాజకీయంగా, నైతికంగా కేవీపీ చేరిక లాభాన్నిచ్చేదే.ఎందుకంటే జగన్ కి కేవీపీ రాజకీయానుభవం ఎంతైనా అవసరం.అందులోనా YS కి ప్రాణమిత్రుడైన కేవీపీ జగన్ తో కలవడం ప్రజల్లో కూడా కొంత సానుకూలతను తీసుకొస్తుంది..అది కాక YS తో కేవీపీ కి ఉన్నా సాన్నిహిత్యం రీత్యా చేజారిన YS కోటరీ మొత్తం తిరిగి వైసీపీ లో చేరికకు కేవీపీ అనే బ్రహ్మాస్త్రం జగన్ కి ఉపయోగపడనుంది.