చినబాబు చూపు ఢిల్లీ వైపు!

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఢిల్లీ లో ఏపీ ప్రతినిధిగా లోకేష్ బాబును నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పార్టీ లో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.కాగా ప్రస్తుత ఏపీ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీకాలం నెలక్రితమే పూర్తయినా, ఇప్పటివరకూ అధికార ప్రతినిధిగా ఎవరినీ నియమించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది.

లోకేష్ ని ఢిల్లీకి పంపడం పై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లోకేష్ ఇప్పటికే సర్వేలు,సమన్వయం వంటి విషయాలతో బిజీ గా ఉన్నందున లోకేష్ యదావిధిగా ఇక్కడే ఉంచడం మంచిదన్నది ఓ వాదన కాగా అధినేత ఆలోచనలు మరో రకంగా వున్నాయి.ఇప్పటికే తెలంగాణ నుండి కేటీర్,కవితలు ఢిల్లీ లెవెల్ లో పార్టీ ని బలోపేతం చేస్తూ జాతీయ,ప్రాంతీయ పార్టీ నాయకులతో సత్సంబంధాలు నెరుపుతున్నారు.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎర్రన్నాయుడు మరణం తర్వాత ఢిల్లీలో కేంద్రానికి-పార్టీకి, ఇతర పార్టీలకు-టీడీపీ మధ్య సమన్వయం చేసే నాయకుడు లేకుండా పోయారన్న ఆవేదన చాలాకాలం నుంచి ఉంది. ఎర్రన్నాయుడుకు ఆ రెండు భాషలపై పెద్దగా పట్టులేకపోయినా, ఆ లోటు కనిపించకుండా చేయడంలో విజయం సాధించారు.

ప్రస్తుతం వ్యాపార వ్యాపకం ఉన్న ఎంపీ లేక్ తప్ప రాజకీయ వ్యాపకమున్న ఎంపీ లు కరువయ్యారు.వారెవరూ పార్టీ వాణిని వినిపించకపోతున్నారు.అదీ కాక జాతీయ మీడియాలో సరైన ఆంగ్లం, హిందీలో మాట్లాడేవారు లేకపోవడాన్ని చంద్రబాబు లోటుగా భావిస్తున్నారు.లోకేష్ అయితే వీటన్నిటిని సమన్వయం చేసుకుని పార్టీకి ఢిల్లీ లెవెల్ లో వైభవం తీసుకొస్తాడని బాబు బాహావిస్తున్నాడు.అన్నికంటే ముక్యంగా ఎటువంటి రాజకీయానుభవం లేని లోకేష్ ని ముందుగా రాజ్యసభకు పంపి అక్కడినుండి ఢిల్లీ లో లోకేష్ ని పాగా వేయిద్దామనుకున్న చంద్రబాబు చివరి నిమిషంలో ఆ ఆలోచనని విరమించుకుని ఏపీ ప్రతినిధి అయితే ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.