పవన్ రికార్డ్ శృతి వల్ల బ్రేక్ అవ్వలేదు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఓ సారూప్యత ఉంది.పవన్ ఒక సారి పనిచేసిన హీరోయిన్ తో మళ్ళీ ఇంతవరకు పనిచేయలేదు ఒక్క రేణుదేశాయ్ తో తప్ప.రేణు దేశాయ్ ని వేరే వాళ్ళతో పోల్చలేం ఎందుకంటే రేణుతో పవన్ కి వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది.ఆ సంబంధమే వారిద్దరూ కలిసి రెండో సినిమా జానీ లో నటింపచేసింది.అదీ కాక ఆ సినిమా పవన్ ఓన్ డైరెక్షన్ కూడా చేయడం రేణుకు రెండో ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు.

అయితే ఇప్పటి వరకు 20 సినిమాలకు పైగా నటించిన పవన్ యాదృచ్ఛికంగానో,ఉద్దేశపూర్వకంగానే తెలీదు కానీ హీరోయిన్స్ ఎవరూ మళ్ళీ రిపీట్ అవ్వకపోవడం గమనార్హం.అయితే ఈ మధ్య పవన్ శృతిహాసన్ కలిసి నటించిన గబ్బర్ సింగ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే.వారిద్దరి కంబినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తూ పవన్ తాజాగా ఖుషి డైరెక్టర్ SJ సూర్య తో ఓ సినీ ప్లాన్ చేశారు.అయితే ఆ సినిమా మొదలుపెట్టి దాదాపు 2 నెలలుపైనే కావస్తోంది ఇంతవరకు ముందుకు కదల్లేదు.తాజాగా సూర్యని తప్పించి డాలీ ని లైవ్ లోకి తెచ్చారు.అయితే ముందుగా శృతి ఇచ్చిన డేట్స్ కి సినిమా ప్రారంభం కాక పోగా ఇప్పుడు శృతికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల పవన్ తో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.అంటే పవన్ ఇంకో కొత్త హీరోయిన్ ని వెతుక్కోవాలన్నమాట.కాబట్టి పవన్ హీరోయిన్ ని రిపీట్ చేయడనే రికార్డ్ ని శృతి ఈ విధంగా నిలబెట్టిందన్నమాట.