బాలయ్యకు రిస్కా? హిస్టరీ రిపీట్స్

బాలకృష్ణ లెజెండ్ సినిమాలో డైలాగు గుర్తుందా ‘నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్’ .ఆ డైలాగు ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. డైలోగ్స్ చెప్పడమే కాదు రిస్క్ చెయ్యడము ఈ నందమూరి నటసింహానికి భలే సరదా. తాజాగా బాలకృష 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలానే వున్నాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్.. హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్.. ఇప్పుడు జార్జియాలో మూడో షెడ్యూల్.. అన్నింటిలోను యుద్ధాలనే తీస్తున్నాడు క్రిష్.

తాజాగా జార్జియాలో జరుగుతున్న షూటింగ్ లో.. క్లైమాక్స్ ఎపిసోడ్ ల చిత్రీకరణ జరుగుతోంది.ఈ తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో అత్యంత రిస్కీషాట్స్ చాలానే ఉన్నాయని సమాచారం. అయితే ఫైట్ మాస్టర్ మాత్రం బాలయ్యని రిస్క్ తీసుకోవద్దని సూచించాడట. బాలయ్య అంకితభావం గురించి మనందరికీ తెలిసిందే కదా అందుకే బాలయ్య ఖరాఖండి గా నో చెప్పేసాడు.

‘ఎంత రిస్కీషాట్ అయినా చేసేయడమే.. బాడీ డబుల్స్ వద్దు’ అని ఖరాఖండీగా చెప్పారట బాలయ్య. అయినా బాలయ్యకు రిస్క్ షాట్స్ చెయ్యడం కొత్తేమి కాదు.ఆ మధ్య లయన్ సినిమా షూటింగ్ లో ఇలాంటి రిస్క్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. అయినా సరే వయసు తనలోని నటుడికి, తనకు నటనమీద ఉత్సాహానికి అడ్డుకాదని బాలయ్య ఎంతటి రిస్క్ షాట్ కయినా సై అంటున్నాడు. ఎంతయినా బాలకృష్ణ ని చూసి ఈ తరం కుర్ర హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.