రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]

టీడీపీలో చక్రం తిప్పుతున్న బీసీ నేత…!

తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించని ధీమా వచ్చేసింది అనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలో గెలుపుపై ఆశలు వదులుకున్న నేతలు సైతం ఈ సారి భారీ మెజారిటీ ఖాయమని కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నేతలు పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంఛార్జులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయించడం […]

ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ పోటీ చేస్తారో తెలుసా…?

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇందుకు కీలక కారణాలున్నాయి. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో రాజధాని అమరావతి పరిధిలో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలో గుండె జగన్.. జగన్ అని కొట్టుకుంటుంది అంటూ మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇసుక ర్యాంపులు, పేకాట శిబిరాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది… మనకెంత ఇస్తారు…. అంటూ మాట్లాడిన ఆడియో కాల్ పెద్ద వైరల్ అయ్యింది. […]

ప్రజాక్షేత్రంలోని నారా లోకేష్, భువనేశ్వరి… క్యాడర్‌ కోసమేనా…?

నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నారు. చంద్రబాబు లేకుండా జరుగుతున్న తొలి సమావేశంలో పార్టీ కీలక ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితోపాటు నారా లోకేష్ పర్యటనల షెడ్యూల్ ఖరారు కానున్నది. చంద్రబాబు అరెస్టుపై ఒకపక్క న్యాయ పోరాటం చేస్తూనే.. మరోపక్క ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన విధానంపై పార్టీ సమావేశం చర్చించనున్నది. నిలిచిపోయిన ”బాబు షూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” అనే కార్యక్రమాన్ని చంద్రబాబును […]

నవంబర్ వరకు జైలులోనే నివాసం… నిజమేనా…?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే ఆయన నవంబర్‌ నెలలో బయటకు వస్తారని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చంద్రబాబు కేసులకు వర్తిస్తుందని, అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన కేసులు చెల్లవని వేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ తీర్పును […]

బాబు ఇప్పట్లో బయటకు రానట్లేనా….!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బయటకు రారా… ఆయన బయటకు రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది…. ఈసారి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు జైలులోనేనా… ప్రస్తుతం ఇవే ప్రశ్నలు టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం మా నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నప్పటికీ… ఆ ముత్యం ఎప్పుడు అవుతుందో.. ఎప్పుడు బయటకు వస్తారని అడిగితే మాత్రం… నో కామెంట్ అనేస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్న […]

తెలుగుదేశం పార్టీలో కొత్త లీడర్ వచ్చేశారు…!

తెలుగుదేశం పార్టీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ చేశారనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 42 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై మరి కొన్ని కేసులు కూడా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు […]

చంద్రబాబు లేకుండానే తొలి భేటీ… అందుకేనా…!

టీడీపీ సర్వ సభ్య సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా చంద్రబాబు లేకుండా జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బాబు షూరిటీ…. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించడం, నిజం గెలవాలి అనే నినాదంతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటనల పై చర్చించనున్నారు. మాజీ మంత్రి లోకేష్ నేతృత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ […]

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ నుంచే పోటీ చేస్తారా….!?

చంద్రబాబు అంటే… అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే నియోజకవర్గం కుప్పం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఇప్పటికే వరుసగా 7 సార్లు విజయం సాధించారు. 1989లో తొలిసారి కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు… నాటి నుంచి వరుసగా 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే… 1999 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో కాలు […]