ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు […]
Tag: Telugu desam
టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?
తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ […]
రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?
జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]
వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై రాష్ట్ర ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది. రెండురోజుల క్రితం మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేయగా, తాజాగా ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని మరో కేసు నమోదు చేశారు. ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తూ ఆయనను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం వ్యూహం రూపొందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ను అధికార […]
స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!
ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]
అచ్చెన్న ఎందుకిలా.. మరీ ఇలా అయితే ఎలా….?
కింజరాపు అచ్చెన్నాయుడు… రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మాజీ మంత్రిగా.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. అయితే ఆయన తీరు మాత్రం సిక్కోలు జిల్లా పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇందుకు కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు సిక్కోలు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ హవాలో సైతం వరుసగా రెండోసారి టెక్కలి నియోజకవర్గం నుండి విజయం సాధించారు అచ్చెన్న. ఉత్తరాంధ్ర […]
అయ్యన్న – గంటా… ఇదో తెగని పంచాయతీ…!
విశాఖ రాజకీయాల్లో వారిద్దరిదీ సుదర్ఘీమైన ప్రస్థానం, ఒకేపార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. కేబినెట్ సహచరులుగాను పనిచేశారు. కానీ ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు, విసుర్లే ఉంటాయి. పార్టీ అధినేత జోక్యంతో మెత్తబడినట్లు కనిపిస్తారు. బాస్ కోసమే చిరునవ్వులు చిందించి, చేతులు కలుపుతారు. కొన్నాళ్లకే మళ్లీ వైరానికి దిగుతూ పాతపాటే పాడుతారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత […]
రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!
విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]
టీడీపీలో చక్రం తిప్పుతున్న బీసీ నేత…!
తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించని ధీమా వచ్చేసింది అనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలో గెలుపుపై ఆశలు వదులుకున్న నేతలు సైతం ఈ సారి భారీ మెజారిటీ ఖాయమని కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నేతలు పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంఛార్జులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయించడం […]