తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించని ధీమా వచ్చేసింది అనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సానుభూతి తమకు ఓట్లు కురిపిస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలో గెలుపుపై ఆశలు వదులుకున్న నేతలు సైతం ఈ సారి భారీ మెజారిటీ ఖాయమని కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది నేతలు పార్టీలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంఛార్జులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాబోయే ఎన్నికల్లో వారికే టికెట్లు కేటాయించడం దాదాపు ఖాయమని కూడా ప్రకటించారు. అయితే ఇంఛార్జులను కాదని మీకే టికెట్ వచ్చేలా చేస్తామంటూ కొందరు కీలక నేతలు లోపాయికారిగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలు… మాజీ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు సైతం ఇదే హామీలిస్తూ… నేతల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది.
ప్రధానంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెద్ద ఎత్తున టికెట్ల హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ చెంగల రాయుడు పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే అక్కడ చెంగల రాయుడుకు బదులుగా రాజు విద్యా సంస్థల అధినేత జగన్ మోహన్ రాజును తెరపైకి తీసుకువచ్చారు కొల్లు రవీంద్ర. రాజుకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు, పార్టీకి ఫేక్ రిపోర్ట్ ఇచ్చేందుకు చాణక్య స్ట్రాటర్జీస్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు. అలాగే మదనపల్లె నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే విధానం అనుసరిస్తున్నారు. ఇక నిడదవోలులో కూడా బూరుగుపల్లి శేషారావుకు బదులుగా… దోరయ్యకు అనుకూలంగా ప్రచారం చేయిస్తున్నారు అచ్చెన్నాయుడు. తాజాగా తిరువూరు నియోజకవర్గంలో దేవదత్‌ను కాదని… వైసీపీ రెబలె ఎమ్మెల్యే డా.ఉండవల్లి శ్రీదేవిని కొల్లు రవీంద్ర ప్రొత్సహిస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తం చేతులు మారినట్లు కూడా ఆరోపణలున్నాయి.