నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు. ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ […]

ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]

బందరులో భారీ ట్విస్ట్..వైసీపీ లక్?

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికలు ఉండవని ఖచ్చితంగా చెప్పొచ్చు..గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండదు. టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. పైగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడ్‌లోకి వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ బలం పెరిగిందని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి […]

ఎమ్మెల్యేగా రాజుగారు..వైసీపీపై రివెంజ్..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపే తరుపున నర్సాపురం ఎంపీగా గెలిచిన ఆయన..ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు చేశారు. వైసీపీ తప్పులని నిత్యం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇక తమని టార్గెట్ చేసిన్ రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే రఘురామ ఢిల్లీలో ఉంటూ..ప్రాతిరోజూ మీడియా సమావేశం పెట్టి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా వైసీపీ […]

తూర్పులో ‘ఫ్యాన్’కు అదిరిపోయే దెబ్బ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే..జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అందుకే ప్రతి పార్టీ కూడా తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీకి..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోగా, 2019లో వైసీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చెప్పి ఇటు వైసీపీ, అటు టీడీపీ […]

నాలుగు సీట్లు..లక్ష మెజారిటీ..!

ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతుంది..గట్టిగా తిప్పికొడితే ఇంకా ఏడాదిన్నర కూడా సమయం లేదు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఆరు నెలలు మాత్రమే. ఇక ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీకి ఇప్పటినుంచే సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటినుంచే అభ్యర్ధుల విషయంలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అలాగే నియోజకవర్గాల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా టీడీపీ-వైసీపీ దూకుడుగా ఉంటే..జనసేన మాత్రం ఎన్నికల విషయంలో దూకుడు కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకులు లేరు. పోనీ బలం ఉన్న […]

తూర్పులో జనసేనతో భారీ మార్పులు..!

రాష్ట్రంలో జనసేన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గాని…కోస్తాలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంటుందని మొదట నుంచి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుందని గత ఎన్నికల్లో రుజువైంది. ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దీని వల్ల టీడీపీకి భారీగా నష్టం, వైసీపీకి భారీగా లాభం చేకూరింది. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన గాని విడిగా […]

ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]

బుచ్చయ్యకు ‘జనసేన’ గండం..!

గత ఎన్నికల్లో దాదాపు 50 వరకు నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి జనసేన కారణమైన విషయం తెలిసిందే. జనసేన గెలవలేదు..అలాగే టీడీపీని గెలవలేదు. వెరసి వైసీపీకి బెనిఫిట్ అయింది. వైసీపీ భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పటికీ జనసేన వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే దాదాపు […]