పవన్ కళ్యాణ్ ని ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాని కి సంజాయిషీ కూడా ఇచ్చుకుని ఇంకెప్పుడు పవన్కళ్యాణ్ గురించి మాట్లాడాను అనికూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్కళ్యాణ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. అయితే ఈ సారి పాజిటివ్ కామెంట్స్ చేసాడు. మొన్న పవన్ తిరుపతిలో […]

జనసేన ఇకపై హైపర్‌ యాక్టివ్‌!

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్‌ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ […]

మాట తప్పను మడమ తిప్పను: పవన్‌

‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా […]

పవన్‌ – అభిమానమా? రాజకీయమా?

పవన్‌కళ్యాణ్‌ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని ఇప్పటికే ఎంచుకోగా, ఆ మైదానం పవన్‌ అభిమానులకు సరిపోతుందా? అన్న అనుమానాలున్నాయి. పోలీసు సిబ్బంది, తగినంత ఫోర్స్‌ లేకపోవడంతో సభకు అనుమతి విషయంలో మల్లగుల్లాలు పడింది. అయితే తమ వాలంటీర్లు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తారని పవన్‌ చేసిన సూచనతో పోలీసులు సభకు అనుమతిచ్చారు. ఎలాగూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్‌కళ్యాణ్‌ ‘మిత్రపక్షం’ కావడంతో సభకు ఇలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అయితే అకస్మాత్తుగా పవన్‌కళ్యాణ్‌ […]

జనజీవన శ్రవంతిలోకి ‘జనసేన’

2012 ఎన్నికలకంటే ముందే జనసేన పార్టీ ని స్థాపించి రాజకీయాల్ని ప్రక్షాళనం చేస్తా.. ప్రశ్నించడమే నా పని అని నిందించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత కేంద్రంలో మోడీని రాష్ట్రంలో చంద్రబాబు ని భుజాలపైకెత్తుకుని ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు పవన్ జి. అసలు పార్టీ ఎందుకు పెట్టినట్టు..పెట్టాడు సరే..ఎన్నికల్లో వేరే పార్టీ కి మద్దతు పలకడం దేనికి.పలికాడు సరే..కనీసం పోటీకూడా చేయకుండా మద్దతు పలకడానికి పార్టీ దేనికి.ఇవే సగటు పవన్,జనసేన అభిమానుల్ని కలిచి వేసిన ప్రశ్నలు. […]

2019 ఎన్నికలే టార్గెట్ గా జనసేన

జ‌న‌సేన విజృంభిస్తోంది! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఇక యాక్టివ్‌గా పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌న‌సేన టాప్ పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బ‌డేలా ప‌వ‌న్ తెర‌వెన‌క క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా జ‌న‌సేన‌కు ప‌వ‌ర్ ఫుల్ టీంను ఆయ‌న సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. ఇందుకోసం ప‌వ‌న్ త‌న‌కు కావాల్సిన‌, త‌ను కోరుకుంటున్న ల‌క్షణాలున్న నేత‌ల‌ను ఎంచుకుంటున్నార‌ట‌. వారిలో గ‌తంలో కేంద్ర మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో […]

పవన్ పై అభిమానం ప్రాణం తీసింది

సినిమాలంటే మోజు ఉండొచ్చు..సినిమా హీరోలంటే అభిమానంఉండొచ్చు..కానీ అవి హద్దుల్లో ఉంటేనే అందం..హద్దు మీరితే వికృత రూపం దాలుస్తుంటాయి.అయినా ఫేస్బుక్..వాట్సాప్ అంటున్న ఈ ఆధునిక యుగం లో కూడా హీరోలంటే వెర్రితలలేసే అభిమానులున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. అసలు విషయం లోకి వస్తే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు.పేరు వినోద్,ఊరు తిరుపతి.పార్టీ తరపున ఓ చారిటి కార్యక్రమానికి కర్ణాటకలో ఉన్న కోలార్ నగరానికి వెళ్లిన వినోద్ కి తోటి […]

అందుకే జనసేన పార్టీని రద్దుచేసెయ్యాలట

పవన్‌కళ్యాణ్‌ కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణే జనసేన అనే పార్టీ ఒకటుందన్న విషయాన్ని మర్చిపోయారు. డబ్బుల్లేవు కాబట్టి పార్టీని నడపలేకపోతున్నట్లు ఓ సందర్భంలో ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పటిదాకా పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సిన జనసేన, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనూ మొహం చాటేసింది. జనసేన అనే పేరుతో ఓ […]

పవన్‌కళ్యాణ్‌ వచ్చేస్తున్నాడోచ్‌

అతి త్వరలో పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్‌. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్‌ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్‌ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్‌ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్‌ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ […]