జనజీవన శ్రవంతిలోకి ‘జనసేన’

2012 ఎన్నికలకంటే ముందే జనసేన పార్టీ ని స్థాపించి రాజకీయాల్ని ప్రక్షాళనం చేస్తా.. ప్రశ్నించడమే నా పని అని నిందించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత కేంద్రంలో మోడీని రాష్ట్రంలో చంద్రబాబు ని భుజాలపైకెత్తుకుని ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు పవన్ జి. అసలు పార్టీ ఎందుకు పెట్టినట్టు..పెట్టాడు సరే..ఎన్నికల్లో వేరే పార్టీ కి మద్దతు పలకడం దేనికి.పలికాడు సరే..కనీసం పోటీకూడా చేయకుండా మద్దతు పలకడానికి పార్టీ దేనికి.ఇవే సగటు పవన్,జనసేన అభిమానుల్ని కలిచి వేసిన ప్రశ్నలు.

అయినా అభిమానులు నిరాశపడకుండా పార్టీకోసం పవన్ కోసం అంటూ పవన్ కి మద్దతుగానే వున్నారు.అయితే ఆ మద్దుతులో రాను రాను మార్పు కనిపిస్తోంది.దీనికి కారణం పవన్ వ్యవహార శైలి అనే చెప్పాలి.రాష్ట్రం లో ఎన్ని సమస్యలున్నాయి..కేంద్రం ప్రత్యేక హోదా పైన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది.ఇలాంటి తరుణం లో కూడా పవన్ ప్రశ్నించక పోవడం తో అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది.

అయితే తిరుపతికి చెందిన జనసేన కార్యకర్త,పవన్ వీరాభిమాని వినోద్ మృతిచెందిన విషయం తెలిసిందే.వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే మకాం వేసాడు.నిన్న తిరుమల వేంకటేశుని దర్శించుకున్న పవన్ జనసేన పార్టీ బహిరంగసభకు తిరుపతిలో ఏర్పాట్లు చేస్తున్నాడు.అయితే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా తిరుపతిలోనే భారీ బహిరంగ సభతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.పవన్ పార్టీ పెట్టి చాన్నాళ్ళయినా ఇప్పటిదాకా ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించింది లేదు.తొలిసారిగా పవన్ కూడా అన్నయ్య చిరంజీవి లా తిరుపతిలోనే  బహిరంగ సభకు ప్లాన్ చేస్తుండడం విశేషం.

అయితే ఉన్నపలంగా ఈ బహిరంగ సభ వెనుక ఉద్దేశం ఏంటో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.అధికార ప్రతిపక్ష పార్టీ లు ఇప్పటికే దీనిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.అయితే అప్పుడెప్పుడో రిబ్బన్ కట్ చేసి గాలికొదిలేసిన జనసేనను  జనాలు మర్చిపోయే లోగా ఇంకో శిలా ఫలకం వేస్తే మళ్ళీ జనజీవన స్రవంతిలో జనసేనని కలిపినట్టుంటుందనే పవన్ ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.అదీగాక 2019 ఎన్నికలకి బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలంటే..ట్విట్టర్లు..హైద్రాబాదు..సినిమాలు..6 నెలలకోసారి ప్రెస్ మీట్లు సరిపోవని పవన్ కి ఇప్పటికైనా అర్థమయిందేమో మరి.అదే నిజమయితే జనసేనకు మంచి రోజులొచ్చినట్టే.