ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసే వాళ్ళు.. 200 ఇస్తా వస్తావా అంటూ అడిగారు.. నేను ఓకే అన్న.. బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెర సీరియల్ నటి కీర్తి భ‌ట్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ అమ్మడు.. మనసిచ్చి చూడు సినిమాతో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో కంటెస్టెంట్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. హౌస్ నుంచి వచ్చిన తరువాత కూడా మంచి పాపులారిటీతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మధురానగరిలో సీరియల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈమె నిజజీవితం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించే విషాద గాధ.

కీర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై.. ఆమె తల్లిదండ్రులు, అన్న, వదిన అందరు ఒకేసారి చనిపోవడంతో ఆమె అనాధగా మారింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా కాలం పాటు హాస్పిటల్లో ఉన్నానంటూ గతంలో చాలా వేదికలపై ఆమె షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆ టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాన‌ని.. భయంకరమైన వేదనను అనుభవించానంటూ.. తన బ్యాడ్ ఎక్స్పీరియన్స్‌లను గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రమాదంలో తను అందరిని కోల్పోయిన సమయంలో.. తనని మంగళూరుకు తీసుకువెళ్లారని.. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చిందని.. అయితే ఎవరు చెప్పుకోలేని కష్టాలను తాను ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది.

ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తాకే వాళ్లని.. స్పర్శ లేకపోవడంతో వారిని నేను ఏం చేయలేకపోయానని.. నేను ఫిట్ అయిన తర్వాత వాళ్లకి దూరంగా వచ్చేయాలనుకున్న.. కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. చివరికి ఆటో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడిగేదాన్ని.. వాళ్ళు నన్ను అదోలా చూసి 200 ఇస్తాను వస్తావా అంటూ అడిగే వారిని.. సరే వస్తానని చెప్పేదాన్ని.. అయితే వాళ్ళ అసలు ఆలోచన నాకు తెలియదు. తర్వాత వారి మాటలు, వారి బిహేవియర్ ను బట్టి నాకు అర్థం అయ్యేది అంటూ కీర్తి భ‌ట్ తన ఆవేదనను వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అంత షాక్ అవుతున్నారు.