తూర్పులో ‘ఫ్యాన్’కు అదిరిపోయే దెబ్బ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే..జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అందుకే ప్రతి పార్టీ కూడా తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీకి..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోగా, 2019లో వైసీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది.

అయితే 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చెప్పి ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల నుంచి ఇక్కడ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పరిస్తితులని చూస్తుంటే..వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ-జనసేన బలం పెరుగుతుందని ఈ మధ్య వచ్చిన సర్వేల్లో కూడా స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది..అది ఏంటంటే..ఒకవేళ టీడీపీ-జనసేన గాని విడివిడిగా పోటీ చేస్తే..జిల్లాలో వైసీపీకి ఆధిక్యం వస్తుందని తెలుస్తోంది.

కానీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి అదిరిపోయే దెబ్బ తగులుతుందని తెలిసింది. తాజాగా వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఇదే స్పష్టమైందట. జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉంటే..టీడీపీ-జనసేన పొత్తు వల్ల 15 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలిందట.  వైసీపీకి 4 సీట్లలోనే గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది..కానీ ఇప్పుడు ఆ పరిస్తితులు మారిపోతూ వస్తున్నాయి.

ఇప్పుడు వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ ఉంది..కొన్ని సీట్లలో జనసేనకు బలం ఉంది. అంటే మూడు పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీ-జనసేన కలితే మాత్రం తూర్పులో వార్ వన్ సైడ్ అయిపోతుందని వైసీపీ అంతర్గత సర్వేల్లోనే తేలింది. మొత్తానికి చూసుకుంటే పొత్తు అనేది వైసీపీకి భారీ నష్టమే.