మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక మెగా కుటుంబంలోనూ చాలామంది హీరోలు ఉన్నారు. చిరంజీవి కుటుంబంలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నెంబర్ వన్ హీరోగా.. తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ హీరోలే కదా వీరి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని అభిమానిస్తారు అని అంతా అనుకుంటారు. అయితే చిరు ఫ్యామిలీ మొత్తానికి రామ్ చరణ్ ఫేవరెట్ హీరో అని అంతా భావిస్తారు. అయితే మెగా ఫ్యామిలీ లేడిస్ వారి ఫ్యామిలీలో ఉన్న హీరోల కంటే ఎక్కువగా బయట హీరోని అభిమానిస్తున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. తన సొంత భర్త ఎంత పెద్ద స్టార్ అయినా.. అతనిని కాకుండా అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్ అంటే ఉపాసనకు బాగా ఇష్టమని ఇటీవల వివరించింది. అలాగే చిరంజీవి భార్య, చరణ్ తల్లి సురేఖకు తన భర్త, కొడుకు కంటే జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా ఇష్టమట. ఆమె జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని సమాచారం. ఇక రాంచరణ్ ఫేవరెట్ హీరో మాత్రం పవర్ స్టార్ అట.
చిన్నతనం నుంచి బాబాయ్ అంటే చరణ్ కి చాలా ఇష్టమని.. చిన్నపడి నుంచి బాబాయి సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగిన అక్కడికి వెళ్లి పోయేవాడని సమాచారం. అలాగే బాబాయ్ కోసం ఎలక్షన్స్ లో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి పవన్ అంటే రామ్ చరణ్ కి మంచి అభిమానం. నటుడు గానే కాకుండా ఇంటి సభ్యులలో కూడా రామ్ చరణ్ కు పవన్ పై ఎంతో ప్రేమ ఉంది. ఇక చిరంజీవికి ఇష్టమైన హీరో తన కొడుకు రామ్ చరణ్. మొదటి నుంచి రాంచరణ్ గొప్ప స్టార్ అవుతాడని ఆయన భావిస్తూ ఉండేవారు. చాలా సందర్భాల్లో ఆయన ఇదే విషయాన్ని వివరించారు కూడా. ఆయన అనుకున్నట్టుగానే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.