గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ గా మారింది . అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ..ప్రెగ్నెంట్ అనే వార్త . ఎస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనదైన స్టైల్ లో రాజ్యమేలేసిన కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . 2021 డిసెంబర్ లో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది . ఆ తర్వాత చాలా సార్లు కత్రినా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .
ఎప్పటికప్పుడు అదంతా ఫేక్ అని రూమర్స్ అని కొట్టి పడేస్తూనే వచ్చారు ఈ జంట. తాజాగా కత్రినా లండన్ కు వెళ్ళింది . అక్కడ రెండు రోజుల కిందట ఒక కాఫీ షాప్ లో ఒక అభిమానికి సెల్ఫీ ఇచ్చింది . ఈ ఫోటోలో కత్రినా లాంగ్ సైజ్ కోట్ వేసుకొని చేతిలో కాఫీ కప్ పట్టుకొని అట్రాక్టివ్ గా కనిపించింది. సడన్ గా ఈ ఫోటో చూస్తే ఎవరైనా సరే కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అని అనుకోకు తప్పదు . దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మారుమ్రోగిపోయింది .
అంతేకాదు కొన్ని ఫేక్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి . కత్రినా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అని ..బాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా కత్రినా ప్రెగ్నెంట్ అంటూ ఫిక్స్ అయిపోయారు . రీసెంట్గా కత్రినా ప్రెగ్నెన్సీ న్యూస్ పై స్పందించారు విక్కీ కౌశల్ టీం. ఆమె వ్యక్తిగత కారణాలతోనే లండన్ వెళ్లారు అని..ప్రెగ్నెన్సీ కారణంగా కాదు అని క్లారిటీ ఇచ్చారు. చివరగా విజయసేతుపతి హీరోగా నటించిన మేరి క్రిస్మస్ సినిమాలో నటించిన మెప్పించింది కత్రినా. కత్రినా విక్కీ గుడ్ న్యూస్ చెప్తే వినాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!