రైతు పేరుతో లక్షల్లో సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్.. బట్టబయలైన చీకటి బాగోతం..?!

బిగ్‌బాస్ సీజన్ 7ఫేమ్ పల్లవి ప్రశాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతుబిడ్డగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే ఇటీవల ప్రశాంతపై పలు ఆరోపణలు వెలువడటంతో.. అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. రైతులను మోసం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటూ.. రైతుబిడ్డ అని చెప్పుకుంటూ మోసం చేసి డబ్బులు అర్జిస్తున్నాడు అంటూ.. నీ చీకటి బాగోతాలు బయటపడుతున్నాయిలే అంటూ.. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఆటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు.

Pallavi Prashanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్..  వాళ్లకు లక్ష రూపాయల సాయం చేయడంతో

అలాగే ఓ సామాన్యుడు బిగ్ బాస్ లో తన సత్తా చాటుతుంటే అభిమానులు కూడా అతనికి సపోర్ట్ చేసి విన్నర్‌గా నిలిపారు. దీంతో ప్రశాంత్ చాలా ఎమోషనల్ అవుతూ టైటిల్ ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకే పంచుతా అంటూ స్టేజిపై ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ప్రశాంత్ కేవలం ఒక్క లక్ష రూపాయలు మాత్రమే రైతుకి పంచి.. దానికి కూడా పెద్ద హంగామా చేశాడు. మిగతా మనీ అంతా ఇప్పటివరకు ఎవరికీ అందించలేదు. ఆ తర్వాత ఆయన డబ్బు పంచడం అనే ఆలోచనలో లేనట్లు సమాచారం. దీంతో ఆయనను జనాలు తిట్టిపోస్తున్నారు.

Bigg Boss Telugu 7: Pallavi Prashanth shocks everyone with his victory! -  Times of India

బిగ్బాస్ హౌస్లో రైతు బిడ్డగా అడుగుపెట్టి విన్నర్ అయిన తర్వాత రూ.15 లక్షలు కారు, విలువైన బంగారు హారం సంపాదించావు. 35 లక్షల సంపాదించి డబ్బులు పేద రైతులకు ఇస్తానంటూ అబద్ధాలు చెప్పి.. ఇప్పుడు తప్పించుకుంటున్నావా అంటూ లక్ష రూపాయలు పంచి మళ్లీ ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తున్నావా అంటూ.. మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రశాంత్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్తూ.. పలు ఏవెంట్లకు వెళుతూ.. రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు సంపాదిస్తున్నాడట. అలా పల్లవి ప్రశాంత్ నెల సంపాదన రూ.20 నుంచి రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం.