ఒక్కే ఒక్క మాటతో కన్నీళ్లు పెట్టిస్తున్న చిరంజీవి.. గుండెలు పిండేసే పోస్ట్ వైరల్..!

నేడు మదర్స్ డే ..ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ తమ తల్లులతో ఉన్న ప్రత్యేకమైన ఫొటోస్ ను షేర్ చేస్తూ తమ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ ప్రముఖులు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లికి మదర్స్ డే విషెస్ అందించారు . ఇటీవల పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి చాలా డిఫరెంట్గా వెరైటీగా తన తల్లికి విష్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదే విధంగా తన ఫ్యామిలీకి కుటుంబానికి కూడా టైం స్పెండ్ చేస్తూ ఇంపార్టెన్స్ ఇస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తల్లి భార్యతో కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ..”జన్మనిచ్చి పెంచి పోషించిన అమ్మకి ఈ ఒక్కరోజు ఏంటి.. ప్రతి రోజు అమ్మది ఈ జీవితమే మనకు అందించింది ..హ్యాపీ మదర్స్ డే” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

సోషల్ మీడియాలో చిరంజీవి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది . చాలామంది చిరంజీవి పోస్ట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు . కన్నీళ్లు పెట్టించేస్తున్నావ్ బ్రో ..గుండెలు పిండేస్తున్నావ్ అన్న అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది..!!

social