వెంకటేష్ కొత్త మూవీ.. హాట్ టాపిక్ గా అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుంటున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వెంకటేష్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది వెంకటేష్ సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో మరోసారి సినిమా తరికెక్కుతుంది. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది.

Venkatesh, Varun Tej, Anil Ravipudi, 'F3's Fun-filled Theatrical trailer on  May 9th | Telugu Movie News - Times of India

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మూవీ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నిర్మాత దిల్ రాజు దగ్గర తీసుకుంటున్న రెమ్యునరేషన్. ప్రస్తుతం ఇది నెటింట హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి సినిమాకు ఏకంగా రూ.15 కోట్ల చెక్ అందుకున్నాడని వార్త ఒకటి ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి ఇప్పటికే దిల్ రాజు హోమ్ బ్యానర్ లో హిట్ సినిమాలను రూపొందించాడు. ఇక ఇప్పటికే దిల్ రాజుకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన అనీల్.. వెంకీ సినిమాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్న వార్త వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు.

Venky & Anil Ravipudi: Perfect Attempt This Time

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టులో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. కామిక్ స్టైల్ ఉన్న అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో మరో సినిమా వస్తుందని తెలియడంతో వీరిద్దరి అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.