మరికొద్ది గంటల్లో పోలింగ్ స్టార్ట్.. పవన్ కళ్యాణ్ పై వేణుస్వామీ సంచలన కామెంట్స్.. ఏం ట్వీస్ట్ రా బాబు ఇది..!!

కొద్ది గంటల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ కాబోతున్నాయి.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా ఏపీవ్యాప్తంగా సర్వత్ర టెన్షన్ వాతావరణం నెలకొంది . ఈసారి ఏపీ రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి..? సీఎం పదవి ఎవరు చేపట్టబోతున్నారు ..? ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలవబోతోంది ..? మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు జనాలు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ .

ఇప్పటికే మెగా కుటుంబం మొత్తం ఆయన కోసం పిఠాపురం చేరుకొని ప్రచారం చేసింది . పలువురు స్టార్ ప్రముఖులు కూడా ఆయన గెలవాలి అంటూ వీడియోస్ రిలీజ్ చేశారు. సరిగ్గా పోలింగ్కి మరికొద్ది గంటల సమయం ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి .

“పవన్ కళ్యాణ్ మంచి చెప్పిన కానీ వినడు ..ఆయన కేవలం త్రివిక్రమ్ మాటలు మాత్రమే వింటారు .. సొంత అన్న చిరంజీవి చెప్పినా కూడా వినడు .. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆయన గెలవాలని నాకు ఉంది ..కానీ ఆయన జాతకంలో అది లేదు .. నేను ఈ మాటలు చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు .. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో పెద్దగా అవగాహన లేదు కాబట్టి గెలవడం కష్టమే .. జనసైనికులు మాత్రం నేను చెప్పే మాటలకు ట్రోల్ చేస్తూ ఉంటారు.. ఒకానొక మూమెంట్లో నన్ను మెచ్చుకొని నా వీడియోస్ ని బాగా షేర్ చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా నిజాయితీగా చెప్తే మాత్రం వాళ్లకి కోపం వచ్చేస్తుంది ..బూతులు తిట్టేస్తారు.. అయినా కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టే ఆయన గురించి ఉన్నది ఉన్నట్లు చెబుతాను” అంటూ చెప్పుకొచ్చారు . సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!