ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న.. ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్స్..?!

జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా పాపులారిటి దక్కించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌రు. మొదట జబర్దస్త్ లో కామెడి స్కిట్‌ల‌తో మెప్పించిన అవినాష్ తర్వాత పలు షోస్ చేసి పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ప‌టు సినిమాల్లోనూ కొన్ని పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్న అవినాష్.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. తన పర్సనల్ లైఫ్ సంబంధించిన ఎన్నో అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ లో ఫామ్ లో ఉండగా నేను ఇల్లు కట్టుకున్నానని.. అయితే సేవ్ చేసిన డబ్బులు అన్ని దానికి పెట్టేసా. అదే టైంలో కరోనా వేవ్ రావడం.. లాక్ డౌన్ పడి అప్పులు చేయాల్సి వచ్చింది.

Noted Comedian Loses His Baby

దీంతో వడ్డీలు మరింతగా పెరిగాయి. పని లేకపోవడంతో వడ్డీలను కూడా కట్టలేకపోయా. అప్పుల వళ్ళు నాపై బాగా ఒత్తిడి తెచ్చారు. నేను జబర్దస్త్ షోలో చేసినప్పుడు నాకు కామెడీ బాగుందని మెచ్చుకున్న వాళ్లే.. డబ్బు కట్టలేదని నా మొఖం మీద తిట్టారు. దాంతో మానసికంగా కృంగిపోయా. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నా జీవితంలో ఆకలి బాధలే ఉన్నాయి తప్ప.. అప్పుల బాధలు లేవు. ఇల్లు కట్టిన తర్వాత మొదటిసారి అప్పుల బాధలు ఎదుర్కొన్న. దీంతో తట్టుకోలేకపోయా నీటిలో దూకి చనిపోవాలని బావి దగ్గరికి వెళ్ళా. ఒకసారి ఆలోచిస్తే తప్పు చేస్తున్న అనిపించింది.

Who is Mukku Avinash? - Quora

గెటప్ శీను కు ఫోన్ చేసి మాట్లాడా అప్పుడు శీను ఇస్మార్ట్ శంకర్ షూటింగ్లో ఉన్నాడు. వెంటనే పూరి జగన్నాథ్ కు ఫోన్ ఇచ్చి మాట్లాడించారు. ఆయన ఒక్క ఐదు నిమిషాలు నాకు నచ్చ చెప్పాలని చూశారు. పూరి గారి మాటలతో నిజంగానే బ్రతకాలని ఆశ పుట్టింది. ఈ సంఘటన జరిగిన మూడు, నాలుగు రోజులకే నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత నా ఇబ్బందులు తెలుసుకొని నా జబర్దస్త్ ఫ్రెండ్స్ సహాయం అందించారు. శ్రీముఖి కూడా అప్పట్లో నాకు ఐదు లక్షలు ఇచ్చింది. వాళ్ళ వల్లే నా సమస్యలు తీరాయి. ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. వరుస షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నా అంటూ వివరించాడు.