వార్నీ.. రవి యాంకర్ అయ్యింది అందుకా..? ఇంత ఓపెన్ గా చెప్పేశాడు ఏంటి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా కూడా మేల్ యాంకర్స్ చాలా తక్కువ నే చెప్పాలి. మరీ ముఖ్యంగా మనం ఫిమేల్ యాంకర్స్ గురించి చెప్పుకోవాలి అంటే పెద్ద లిస్టు వస్తుంది . అదే మేల్ యాంకర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే వచ్చే రెండే రెండు పేర్లు రవి – ప్రదీప్ . వీళ్లిద్దరు తప్పిస్తే మేల్ యాంకర్లుగా మరొకరు ఊహించుకోలేం. రీసెంట్గా రీతు వర్మతో దావత్ అనే షోకి అటెండ్ అయ్యాడు రవి. ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ .. ప్రొఫెషనల్ లైఫ్ లో పడిన బాధల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఎంత ఓపెన్ గా అంటే ఆయన అసలు ఇండస్ట్రీలోకి యాంకర్ గా రావడానికి కారణం ఏంటి ..? ఎవరు సపోర్ట్ చేశారు ..? అనే విషయాలను కూడా చెప్పుకొచ్చాడు .

ఆయన మాట్లాడుతూ..” నేను కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోనే.. ఇండస్ట్రీలోకి వచ్చాను ఆయన అంత పెద్ద స్టార్ అయిపోవాలని అనుకున్నాను ..కానీ ఆ తర్వాత అర్థమైంది అలాంటివి జరగవు అని ..నేను కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను పలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈవెంట్స్ కి ప్రైవేట్ పార్టీస్ కి డాన్స్ నేర్పించేవాడిని ..డాన్స్ కూడా చేసేవాడిని.. కాగా ఇదే క్రమంలో అమలా గారు పరిచయమయ్యారు “..

 

“ఆ మూమెంట్ లోనే నాగార్జున గారితో మీటింగ్ ఏర్పడింది . అప్పుడే చెప్పాను నాకు హీరో అవ్వాలని ఉంది సార్ అని.. అయితే నాలోని ఎనర్జీని గమనించిన నాగార్జున గారు సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం కి రిఫర్ చేశారు . ఆ తర్వాత నా కెరియర్ మారిపోయింది. చిరంజీవి గారి అంత ఫేమస్ అవ్వలేను కానీ ఎంతో కొంత ఫాం తెచ్చుకోవాలి అని అనుకున్నాను . ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయిపోయాను”..అని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు. యాంకర్ రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!