పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ స్టార్ హీరో కూతురు సెన్సేషనల్ పోస్ట్..క్షణాల్లో వైరల్..!!

కొద్ది గంటలే.. కేవలం కొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి ..ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు..? ఈసారి అధికారం చేపట్టబోయేది ఎవరు..? గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఎవరు? సీఎం కాబోయేది ఎవరు..? అంటూ హాట్ హాట్ చర్చలు కొనసాగుతున్నాయి . మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈసారి ఏకంగా పాలిటిక్స్ పై కాన్సన్ట్రేషన్ చేయడం సంచలనంగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకు కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే .ఆయనకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అనేకమంది సినీ ప్రముఖులు మెగా ఫ్యామిలీ నుంచి మెగా లేడీస్ కూడా ప్రచారం చేశారు . కాగా రీసెంట్గా మెగా డాటర్ సుష్మిత – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది .

ఆ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారింది . పవన్ కళ్యాణ్ లోని స్పెషల్ క్వాలిటీ చెప్పుకొస్తూ నేటి ఏపీ రాజకీయ వ్యవస్థకు కచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ కావాలి అని ఆమె హింట్ ఇస్తూ గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలి అని అభ్యర్థించారు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు కూడా పెట్టారు . “అతని పోరాటం నిజమైనది ..ఆయన హృదయం ప్రజల కోసమే అతను నిజం కోసం మే నిలబడతాడు.. దయచేసి అండగా నిలబడండి అంటూ సుస్మిత కొణిదెల రిక్వెస్ట్ చేశారు. ఆ పోస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే వైరల్ గా మారింది..!!